హిందువుగానే పుట్టా.. చనిపోతా!
డిప్యూటీ సీఎం శివకుమార్

బెంగళూరు: హిందువుగానే పుట్టాను.. హిందువుగానే చనిపోతానని ఇటీవల శివరాత్రి సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇషా యోగా ఫౌండేషన్ సద్గురు నిర్వహించిన భక్తికార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్ మీడియాతో తన వ్యాఖ్యలను పంచుకున్నారు. సద్గురు కావేరి నీటి కోసం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఈయన రాజకీయాలకతీతంగా ఎప్పుడూ ప్రజలు మేలు కోరే వారని తాను నమ్ముతానన్నారు. సద్గురు పలుమార్లు రాహుల్ గాంధీపై విమర్శల బాణాలు సంధించారు. ఇషా ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొనడం రహాస్యం ఏమీ కాదన్నారు. ఇది తన మత విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. కొందరు నాయకులు తనను యేసు కుమార అని పిలిచారని, కానీ తాను అన్ని కులాలను, మతాలను విశ్వసిస్తానని అంతిమంగా తాను ఒక హిందువునని, హిందువుగానే పుట్టానని, హిందువుగానే చనిపోతానని చెప్పారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా తాను చెప్పేది వాస్తవమన్నారు.