ఆస్కార్​ అవార్డుల ప్రదానం

Oscar Awards

Mar 2, 2025 - 17:51
 0
ఆస్కార్​ అవార్డుల ప్రదానం

1927 నుంచి 2005 వరకు కీలక మార్పులు
కార్చిచ్చుతో వాయిదా వేద్దామనుకున్నా తేదీ మార్పుతో నిర్వహణ
55 అవార్డుల చోరీ, ఇప్పటికే లభించని రెండు అవార్డులు!

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆస్కార్​ అవార్డులు రద్దయ్యే దశ నుంచి వాయిదా పడి సజావుగా కొనసాగే దశకు చేరుకున్నాయి. అయితే షెడ్యూల్​ మార్చి 2న అవార్డులను ప్రకటించాల్సి ఉన్నా, మార్చి 3న అవార్డులను ప్రదానం చేయనున్నారు. కాగా భారత్​ నుంచి ‘కంగువ, స్వతంత్ర వీర్​ సావర్కర్​ వంటి ఐదు చిత్రాలు షార్ట్​ లిస్ట్​ చేసినా, అవి తుది నామినేషన్​ లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఆస్కార్​ వాయిదా పడేందుకు కాలిఫోర్నియాలో కార్చిచ్చులే కారణంగా అధికార వర్గాలు వెల్లడించాయి. తొలుత అవార్డులను పూర్తిగా రద్దు చేయాలని భావించినా చివరలో తేదీని మార్చాలని నిర్ణయించారు. కాలిఫోర్నియా కార్చిచ్చుల్లో పలువురు బాలీవుడ్​ ప్రముఖుల ఇళ్లు, స్టూడియోలు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డు ద్వారా సమకూరిన మొత్తాన్ని అగ్నిప్రమాద బాధితుల కోసం పనిచేసే సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ఆస్కార్​ అవార్డుల కమిటీ ప్రకటించింది. 

1927లో తొలి ఆస్కార్​ అవార్డు..
హాలీవుడ్ స్టూడియో అధిపతి లూయిస్​ బి. మేయర్​ ఆస్కార్​ అవార్డులకు పునాది వేశారు. 1927లో సినీ వర్గ కృషిని మరింత పటిష్ఠం చేయాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి అవార్డును ప్రారంభించారు. అనంతరం 1929లో తొలి ఆస్కార్​ వేడుక 270 మంది సమక్షంలో 15 నిమిషాలపాటు నిర్వహించారు. 1939లో అకాడమీ అవార్డులను ఆస్కార్​ అవార్డులుగా పేరు మార్చారు. తొలిసారిగా ఆస్కార్​ అవార్డు అందుకున్న హలీవుడ్​ నటుడుగా ఎమిల్​ జానింగ్స్ లో నటించిన రిన్​ టిన్​ టిన్​ గుర్తింపు పొందారు. అయితే ఈ అవార్డు ఆయనకు అనుహ్యంగా వరించింది. తొలుత అవార్డును 1929లో విడుదలైన రెండు చిత్రాల్లో ఒకదానికి ఇవ్వాలని నిర్ణయించారు. ఒక సినిమాలో కుక్కకు ఆస్కార్​ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ తుది సమావేశంలో అలాచేస్తే అవార్డుపై తప్పుడు సందేశం వెళుతుందని భావించి నిర్ణయం మార్చుకొని రిన్​ టిన్​ టిన్​ కు అవార్డును ప్రదానం చేశారు. ఈయన 27 హాలీవుడ్​ చిత్రాలలో నటించారు. 

కాగా 96 ఏళ్ల ఆస్కార్​ చరిత్రలో కేవలం నాలుగు భారతీయ చిత్రాలు మాత్రమే ఆస్కార్​ కు నామినేట్​ అయ్యాయి. 1957లో ఉత్తమ విదేశీ భాషా విభాగాన్ని ఆస్కార్​ లో ప్రవేశపెట్టారు. మదర్​ ఇండియా, నైట్స్​ ఆఫ్​ క్యాబిరియా వంటి చిత్రాలు కేవలం ఒక్క ఓటుతో వెనుకబడి అవార్డును కోల్పోయాయి. 1989లో ‘సలాం బాంబే’, 2003లో ‘లగాన్’, 2004లో మరాఠీ చిత్రం ‘శ్వాస్’ తుది నామినేషన్లు పొందాయి. కానీ మూడు చిత్రాలు అవార్డును గెలుచుకోలేకపోయాయి. 

భారత్​ కు పలు విభాగాల్లో ఆస్కార్​ అవార్డు లభించింది.

– 1982లో భాను అథైయ్యా కు బెస్ట్​ కాస్ట్యూమ్​ డిజైనర్ ‘గాంధీ’ చిత్రానికి​ అవార్డు లభించింది. 

– 1991 సత్యజిత్​ రే లైఫ్​ టైమ్​ అచీవ్​ మెంట్​ విభాగంలో లభించింది.

– 2008లో ఎఆర్​ రెహ్మాన్​ ‘స్లమ్​ డాగ్​ మిలియన్​’ కు గాను సంగీతం అందించినందకు బెస్ట్​ ఒరిజినల్​ స్కోర్​ విభాగంలో లభించింది.

– 2008లో రేసుల్లా పుకూట్టి స్లమ్​ డాగ్​ మిలియన్​ చిత్రానికి బెస్ట్​ సౌండ్​ మిక్సింగ్​ విభాగంలో అవార్డు లభించింది.

– 2023లో ‘ఆర్​ఆర్​ఆర్​’ సినిమాకు గాను బెస్ట్​ మ్యూజిక్​ డైరెక్టర్​, నాటు నాటు పాటకు గాను అవార్డు లభించింది. 

– 2024 బెస్ట్​ డాక్యుమెంటరీ చిత్రానికి గాను కార్తికి గుంజాల్విజ్​ గునిత్​ మోంగాకు అవార్డు దక్కింది. 

52 ఆస్కార్ అవార్డులు చోరీ..
2000 సంవత్సరంలో ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవానికి సరిగ్గా 20 రోజుల ముందు 55 అవార్డులతో వెళుతున్న ట్రక్కు అపహరణకు గురైంది. దీంతో కొత్త అవార్డులను హడావిడిగా సిద్ధం చేశారు. అనంతరం కొన్ని రోజుల తరువాత 52 అవార్డులు చెత్తకుప్పల్లో లభించాయి. మిగిలిన మూడింటిలో ఒక అవార్డును డ్రగ్స్​ కేసు  సందర్భంగా పోలీసులు కనుగొని ఆ వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు అవార్డులు ఇప్పటికీ దొరకలేదు.

అత్యధిక ఆస్కార్​ లు అందుకున్న చిత్రాలు..

– ద లైఫ్​ ఆఫ్​ ద రింగ్స్​ 11 ఆస్కార్​ లను గెలుచుకొని రికార్డులలో ముందువరుసలో ఉంది.

– టైటానిక్​ సినిమా కూడా 11 అవార్డులను దక్కించుకుంది.

– బెన్​ హర్​ సినిమా 11 అవార్డులను సొంతం చేసుకుంది.

– వెస్ట్​ సైయిడ్​ స్టోరీ 10 అవార్డులను దక్కించుకుంది.

– ద ఇంగ్లీష్​ పెషెంట్, ద లాస్ట్​ ఎంపరర్, గిగి సినిమాలు ​ 9 అవార్డులను కైవసం చేసుకుంది.