ప్రొటెం స్పీకర్ గా మహతాబ్ ను నియమించిన రాష్ట్రపతి
President appointed Mahatab as Protem Speaker
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఒడిశా కటక్ కు చెందిన బీజేపీ ఎంపీ భర్త్రిహరి మహతాబ్‌ను రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మూ ప్రొటెం స్పీకర్ గా నియమిస్తూ గురువారం ప్రకటన విడుదల చేశారు. నూతన ఎంపీలత పాటు పార్లమెంట్ లో మహతాబ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ కు సహాయకులుగా సురేశ్ కోడికున్నిల్, తలిక్కోట్టై రాజుతేవర్ బాలు, రాధామోహన్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, సుదీప్ బందోపాధ్యాయలను రాష్ట్రపతి నియమించారు.
భర్తిహరి మహతాబ్ కటక్ నుంచి ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది మార్చిలోనే బీజేడీని వీడి బీజేపీలో చేరారు. 2017లో, లోక్‌సభలో జరిగిన చర్చల్లో అద్భుతమైన పనితీరు కనబరిచినందుకు ఆయనకు అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా లభించింది.
ప్రొటెం స్పీకర్ ఎవరు?
ప్రొటెం స్పీకర్ అంటే స్పీకర్ ఎన్నికయ్యే వరకు తాత్కాలిక ప్రాతిపదికన సభలను నడిపేందుకు నియమిస్తారు. ఎన్నికైన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలతో ఆయా సభల్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
18వ లోక్ సభ తొలి సెషన్ జన్ 24న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జూలై 3వ తేదీ వరకు సభ కొనసాగనుంది. స్పీకర్ పదవిపై ఇంకా అనిశ్చితి నెలకొన్నందున రాష్ర్టపతి తన అధికారాలను వినియోగించుకొని ప్రొటెం స్పీకర్ ను నియమించారు.