తాత్కాలిక అధ్యక్షుడిపై అభిశంసనకు ఆమోదం
Approval of impeachment against Acting President
సియోల్: దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు హన్ దుక్ సూపై సూపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. శుక్రవారం సియోల్ పార్లమెంట్ భవన్ లో అభిశంసనపై ఓటింగ్ నిర్వహించారు. 300మంది సభ్యులకు గాను 192 మంది అభిశంసనకు అనుకూలంగా ఓటు వేశారు. సూ పక్షం నాయకులు ఓటింగ్ ను బహిష్కరించారు. పదిరోజుల క్రితం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీని విధించారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడం, ఆందోళనలు చెలరేగడంతో రాత్రికి రాత్రే వెనక్కి తగ్గి ఎమర్జెన్సీని ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర కేబినెట్ భేటీలో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా అది ఆమోదం పొంది పదవీచ్యుతడయ్యారు. దీంతో తాత్కాలిక అధ్యక్షుడుగా హన్ దుక్ సూ ఎంపికయ్యారు. ప్రస్తుతం సూ పై కూడా అభిశంసన కలవరం రేపుతుంది. ఈయన తరువాత తాత్కాలిక అధ్యక్షుడి రేసులో ఆ దేశ ఆర్థికమంత్రి చోయ్ సాంగ్ మోక్ ఉన్నారు.
అభిశంసనపై తాత్కాలిక అధ్యక్షుడు హన్ దుక్ సూ మీడియాతో మాట్లాడుతూ.. చట్టాన్ని గౌరవిస్తానన్నారు. రాజ్యాంగ నిర్ణయం కోసం వేచి చూస్తానని తెలిపారు. కాగా అభిశంసన నిర్ణయం కోర్టుకు వెళ్లనుంది. కోర్టు ఆమోదం పొందేందుకు 180 రోజుల సమయం పట్టనుంది. కోర్టు అభిశంసన ఓటింగ్ ను ఆమోదిస్తుందా? లేదా? అనే దానిపై టెన్షన్ నెలకొంది.