ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక
Election of new Executive Committee of Photographers Union
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణ పరిధిలోని ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ సభ్యులు ఆదివారం సమావేశమై ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షులుగా చంద్రగిరి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ బండి, కోశాధికారిగా చిలుముల కుమార్ లు ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.