సాధువుల ఓపిక అభినందనీయం
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: మహాకుంభమేళాలో తొక్కిసలాట సందర్భంగా 13న అఖారా సాధువుల సహనం, ఓపికను అభినందిస్తున్నానని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శనివారం ప్రయోగ్ రాజ్‌ను సందర్శించి మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటన సందర్భంగా సాధు సంతువులు రక్షక పాత్రను పోషించారని తెలిపారు. సనాతన ధర్మానికి వ్యతిరేకులు వీరిని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం ఎవ్వరికి హాని కలిగించేది కాదన్నారు. మానవత్వం సృష్టిలో గొప్పదనే నియమాన్ని నమ్మేవారే సాధు, సంతువులన్నారు. మరింత నష్టం వాటిల్లకుండా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలిగించే ఉద్దేశ్యంతో తమ శోభాయాత్రను సైతం కుదిరించి సందడి లేకుండా నిర్వహించి వెళ్లారని తెలిపారు. ఎంతో ఓర్పు, నేర్పు, ధైర్యంతో సవాళ్లను ఎదుర్కొన్నారని కితాబిచ్చారు. 19 రోజుల్లో కుంభమేళాలో 32 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారని తెలిపారు. పుణ్యాత్ముల సాంగత్యంలో మనం నిరంతరం ముందుకు సాగాలన్నారు.
కాగా శనివారం 77 దేశాల నుంచి 118 మంది రాయబారులు, ప్రతినిధులు, ప్రముఖులు ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమానికి చేరుకొని పుణ్య స్నానాలాచరించారు.
బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు ఊపు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక శాఖ విడుదల చేసిన బడ్జెట్ దేశ ప్రగతిని సూచిస్తుందన్నారు. గత పదిన్నరేళ్లలో ప్రపంచంలోన అత్యున్నత ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దే ప్రయత్నం అభినందనీయమన్నారు. వడ్డీ లేని రుణాలు, మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు దేశ సామాన్య ప్రజల వృద్ధికి కారణమవుతాయని సీఎం యోగి స్వాగతించారు.