దుర్భరంగా పాక్ ద్రవ్యలోటు
ప్రపంచబ్యాంక్ నివేదిక కోటిమంది పేదరికంలోకి జారిపోయే ప్రమాదం మూడేళ్లుగా ఇదే దుస్థితి ఉగ్రవాదానికి ఊతమే కారణమంటున్న ప్రపంచదేశాలు
ఇస్లామాబాద్: పాక్ ఆర్థిక పరిస్థితి ‘అడకత్తెరలో పోక చెక్క’ అన్నట్లుగా తయారైంది. భారత్ ముందు గొప్పలు పోతున్న పాక్అంతర్జాతీయ సమాజంలో మాత్రం ఆర్థికంగా ఆదుకోవాలని అడుక్కుంటోంది. పాక్పరిస్థితిపై ప్రపంచబ్యాంక్ బుధవారం నివేదిక విడుదల చేసింది. పాక్ ఆర్థిక పరిస్థితులు ఇలాగే ఉంటే 10మిలియన్ల మంది ప్రజలు (కోటిమంది) పేదరికం జాబితాలోకి జారిపోయే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. అసలే ఆర్థిక సహాయం అందక ఓ వైపు ఆపసోపాలు పడుతుంటే మరోవైపు ప్రపంచబ్యాంకు నివేదికతో మరింత అగాధంలోకి పాక్ వెళుతోందన్నది స్పష్టమవుతోంది. ఉగ్రవాదాన్ని విడనాడాలనీ ఎన్నిసార్లు భారత్ విజ్ఞప్తులు చేసినా పట్టించుకోని పాకిస్తాన్దానికి భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నా, ఉగ్రవాదాన్ని మాత్రం అంతం చేసే ప్రక్రియను చేపట్టక పోవడం గమనార్హం.
ప్రపంచబ్యాంక్ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 26 శాతానికి ద్రవ్యోల్బణం చేరుకుంది. ఇది 1.8 శాతం తగ్గిందని పేర్కొంది. అనుకున్న లక్ష్యాలను పాక్ సాధించలేకపోయిందని వివరించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం వరుసగా మూడు సంవత్సరాలపాటు ద్రవ్యలోటు పడుతూనే ఉందని నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్లో 98 మిలియన్ల మంది పేదరికంతో పోరాడుతున్నారని పాక్ అధికార వర్గాలు అంతర్గతంగా పాక్ ప్రభుత్వానికి విన్నవించాయి. ఏది ఏమైనా ఉగ్రవాదం వల్ల పాక్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంటూ ప్రపంచదేశాల ముందు ‘మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తోంది.