సరిహద్దులో పాక్ కాల్పులు
భారత కాల్పుల్లో ఐదుగురు పాక్ జవాన్లు మృతి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ సరిహద్దులో భారత స్థావరాలపై పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ప్రతీకార చర్యగా భారతసైన్యం ధీటుగా సమాధానం ఇవ్వడంతో 4 నుంచి ఐదుగురు పాక్ సైనికులు మృతిచెందినట్లు తెలుస్తుంది. గురువారం వేకువజామున పాక్ సరిహద్దు వైపు నుంచి ఉన్నట్లుండి ఆర్మీ పోస్టులపై కాల్పులకు తెగబడింది. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ ఓ వైపు చొరబాట్లపై నిఘా పెడుతూనే మరోవైపు వారికి ధీటైన సమాధానం ఇచ్చింది. పాక్ సరిహద్దుల వెంట కుట్రలపై జమ్మూకశ్మీర్ ఎల్జీ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నతస్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించనున్నారు.