ఆప్​ దుకాణానికి త్వరలో తాళం

హరియాణా సీఎం నాయాబ్ సింగ్​ సైనీ

Feb 2, 2025 - 17:06
 0
ఆప్​ దుకాణానికి త్వరలో తాళం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఆప్​ అబద్ధాల దుకాణానికి 8 ఫిబ్రవరిన తాళం పడనుందని హరియాణా సీఎం నాయబ్​ సింగ్​ సైనీ అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆదివారం పాల్గొని మీడియాతో మాట్లాడారు. హరియాణా ప్రభుత్వం నీళ్లలో విషయం కలుపుతుందని అసత్య ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఢిల్లీలోని ప్రజలు తమ వారేనని వారికి విషం ఎలా కలుపుతామని ప్రశ్నించారు. ఓట్లను రాబట్టుకునేందుకే ఆప్​ ఈ స్థాయికి దిగజారిందన్నారు. నిరంతరం అసత్యాలు, అబద్ధాలతో కేజ్రీవాల్​ రాజకీయ జీవతం నెట్టుకొస్తున్నారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్​ తన వైఫల్యాలను, దుష్​పరిపాలనను దాచిపెట్టేందుకే నీటిలో విషం అనే అబద్ధాలకు తెరతీశారన్నారు. ప్రజల విశ్వాసం, నమ్మకాలకు సంబంధించిన విషయంతో ఆటలాడుకుంటూ అసత్యాలు చెబుతున్నారని సీఎం నాయబ్​ సింగ్​ సైనీ మండిపడ్డారు.