కుంభమేళా @ 63.36 కోట్లు

Kumbh Mela @ 63.36 crores

Feb 25, 2025 - 11:33
 0
కుంభమేళా @ 63.36 కోట్లు

లక్నో: ప్రయాగ్​ రాజ్​ మహాకుంభమేళాలో 44 రోజుల్లో 63.36 కోట్లకు పుణ్య స్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య చేరుకుంది. మంగళవారం వేకువుజాము నుంచి ఉదయం నుంచి 10 గంటల వరకే 50 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఒక్కరోజే 1.30 కోట్లకు పైగా ప్రజలు స్నానాలు ఆచరించారు. శివరాత్రి (ఫిబ్రవరి 26) పుణ్య స్నానాలకు ఆఖరి రోజు కావడంతో అర్థరాత్రి నుంచే భారీగా భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చారు. దీంతో వైమానిక దళం కూడా రంగంలోకి దిగింది. హెలికాప్టర్ల ద్వారా ట్రాఫిక్​ ఉన్న ప్రాంతాల వివరాలను అధికారులకు ఎప్పటికప్పుడు అందజేస్తుంది. వాహనాల నిషేధం 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు పెంచారు. బుధవారం మహారాత్రి సందర్భంగా  మంగళవారం అర్థరాత్రి నుంచే భారీగా భక్తులు ప్రయాగ్​ రాజ్​ కు చేరుకునేందుకు సమాయత్తమయ్యారు. దీంతో ప్రయాగ్​ రాజ్​ కు దారితీసే ఏడు ఎంట్రీ పాయింట్లలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలు, పాసులను రద్దు చేశారు. అన్ని ఆలయాల వద్ద భారీ రద్దీ నెలకొంది. పోలీసులు, ఆర్మీ రంగంలోకి దిగి ట్రాఫిక్​ జామ్​ ను తప్పిస్తున్నారు.  కాగా సోమవారం పలువురు బాలీవుడ్​ ప్రముఖులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలాచరించారు.