బడ్జెట్​ లో పీఎల్​ ఐని ప్రకటించాలి

డెలాయిట్​ భాగస్వామి సిధ్వా

Jan 19, 2025 - 17:06
 0
బడ్జెట్​ లో పీఎల్​ ఐని ప్రకటించాలి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 1న విడుదల చేయనున్న కేంద్ర బడ్జెట్​ లో పీఎల్​ ఐ (ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​) పథకాన్ని ప్రకటించాలని డెలాయిట్​ ఇండియా డైరెక్టర్​ రోహింటన్​ సిధ్వా ఆకాంక్షించారు. ఆదివారం బడ్జెట్​ పై తన అభిప్రాయాన్ని మీడియాతో సిధ్వా పంచుకున్నారు. పీఎల్​ ఐ పథకాన్ని ప్రకటిస్తే మరిన్ని విదేశాల్లోని సంస్థలను ఆకర్షించవచ్చని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో భారత్​ లో మరిన్ని నూతన ఆవిష్కరణలకు, వృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. తక్కువ పన్ను, రాయితీలు, ఉత్పత్తి, అనుబంధి ప్రోత్సాహకాలపై పీఎల్ ఐ పనిచేస్తుందన్నారు. దీంతో దేశంలో ఉపాధి, పెట్టుబడులకు మార్గం సులభతరం అవుతుందన్నారు. అయితే భారత్​ ను ప్రయోగశాలగా మార్చాంటే మరిన్నినిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అదే పీఎల్​ ఐ వంటి పథకంతో గేమ్​ ఛేంజర్​ గా మారే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకంగా భారత్​ కు వచ్చిన సంస్థలకు పీఎల్​ ఐ ద్వారా రివార్డులు ప్రకటించే నిర్ణయాలు తీసుకుంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరుగుతాయని సిధ్వా స్పష్టం చేశారు. ఇది విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించేందుకు ప్రధాన వనరుగా మారుతుందన్నారు.