కాల్పుల విరమణకు ఒకే: నెతన్యాహు

One for a ceasefire: Netanyahu

Jan 19, 2025 - 16:48
 0
కాల్పుల విరమణకు ఒకే: నెతన్యాహు

జెరూసలెం: ఇజ్రాయెల్​–హమాస్​ మధ్య కాల్పుల విరమణ ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. బందీల విడుదలకు మార్గం సుగమమైందన్నారు. కాగా అంతకుముందు నెతన్యాహు కేబినెట్​ మంత్రి మాట్లాడుతూ.. బందీల జాబితా వచ్చే వరకు కాల్పుల విరమణ అమల్లోకి రాదన్న వ్యాఖ్యలకు బెంజమిన్​ వ్యాఖ్యలతో చెక్​ పడింది. ఆదివారం ఉదయం 8.30 నుంచి కాల్పుల విరమణ అమల్లోకొచ్చింది. ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని కాల్పుల విరమణ తాత్కాలికమని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే పోరాటం కొనసాగించే హక్కు తమకు ఉందని శనివారం అన్నారు. కాగా శనివారం అర్థరాత్రి బందీల విడుదల జాబితా ఇజ్రాయెల్​ కు ఆలస్యంగా చేరడంతో ఆదివారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందంపై నెతన్యాహు మీడియాకు వివరాలందించారు. తొలివిడతలో 42 మంది ఇజ్రాయెల్​ బందీలు విడుదల కానున్నారు. కాల్పుల విరమణ ఆలస్యం కావడంతో ఆదివారం వేకువజామున ఐడీఎఫ్​ గాజాలో జరిపిన వైమానిక దాడుల్లో 8 మంది మృతిచెందారు. కాల్పుల విరమణకు ట్రంప్​ మద్ధతు ఉందన్నారు. ఐడీఎఫ్​ కు శత్రుదేశాలు తలొగ్గి కాల్పుల విరమణకు ముందుకు వచ్చాయని నెతన్యాహు వ్యాఖ్యానించారు.