తెరుచుకున్న పశ్చిమ బెంగాల్–ఝార్ఖండ్ సరిహద్దు
వాహనదారులకు ఉపశమనం మమత సర్కార్ చర్యలపై బీజేపీ సుభేందు అధికారి మండిపాటు వెనక్కి తగ్గిన ప్రభుత్వం
కోల్‌కతా/రాంచీ: పశ్చిమ బెంగాల్– ఝార్ఖండ్ సరిహద్దు ఎట్టకేలకు శనివారం తెరుచుకుంది. దీంతో వేలాది పెద్ద పెద్ద వాహనాలు, యాజమానులు, డ్రైవర్లు ఊపిరిపీల్చుకున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఝార్ఖండ్ డీవీసీ (దామోదర్ వ్యాలీ కార్పొరేషన్) దామోదర్ నది డ్యామ్ ద్వారా నీటిని వదలడంతో వివాదం రాజుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్ లోని 11 జిల్లాలు నీట మునిగాయి. దీంతో సీఎం మమత బెనర్జీ ఈ రాష్ర్ట ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై మండిపడ్డారు. సత్వర చర్యలకు ఇరు రాష్ర్టాల సరిహద్దుల్లో ఉన్న అన్ని దారులను మూసివేశారు. దీంతో వేలాదిగా సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. డ్రైవర్లు తమ రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన బీజేపీ నాయకుడు సుభేందు అధికారి మమత సర్కార్ తీవ్రంగా ఎండగట్టాడు. మరోవైపు వాహన యాజమానులు, డ్రైవర్లు కూడా సర్కార్ పై మండిపడడంతో సీఎం మమత సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. అసలే ఆర్జీకర్ మెడికల్ కళాశాల విద్యార్థిని హత్యతో అట్టుడుకుతున్న రాష్ర్టం సీఎం మమత మరోసారి మతిలేని చర్యలకు పాల్పడుతోందనే ఆరోపణల నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయే వరకూ వీక్షించొద్దని మొండిపట్టుదల విడనాడాలని పలువురు టీఎంసీ నాయకులు మమతను కోరడంతో సరిహద్దును తెరిచారు.