కొనసాగుతున్న బలూచ్​ ఆపరేషన్​

ఆపరేషన్​ పూర్తి.. అవాస్తవమే

Mar 13, 2025 - 13:47
 0
కొనసాగుతున్న బలూచ్​ ఆపరేషన్​

ఇస్లామాబాద్​: పాకిస్థాన్​ సైన్యం బలూచ్​ ట్రైన్​ హైజాక్​ ఆపరేషన్​ ముగించేశామని ప్రకటించడం పూర్తిగా అవాస్తవమేనని తెలుస్తుంది. జాఫర్​ ఎక్స్​ ప్రెస్​ ఆపరేషన్​ గురువారం కూడా కొనసాగుతుంది. పాక్​ సైన్యం చేస్తున్న ఆరోపణలు బలూచ్​ ఆర్మీ తిప్పికొట్టింది. ఇంకా ఆపరేషన్​ ముగియలేదని, తమవద్దే 150 మంది ఆర్మీ జవాన్లు బందీలుగా ఉన్నట్లు ప్రకటించింది. పాక్​ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని పలు ఆధారాలు కూడా ప్రవేశపెట్టింది. పాక్​ ప్రభుత్వం తమ డిమాండ్లపై సీరియస్​ గా లేదని మండిపడింది. కాగా ఆపరేషన్​ పూర్తయ్యిందని ప్రకటించినా ఆ ప్రాంతం గుండా ఇంకా రవాణా కార్యకలాపాలు ఎందుకు నిర్వహించడం లేదు. ఈ పూర్తి ఆపరేషన్​ పూర్తయ్యిందనే వీడియోను ఇంకా ఎందుకు విడుదల చేయలేదు. ఆపరేషన్​ పూర్తయ్యిందంటూ పలువురు జర్నలిస్టులను అక్కడి పంపి పలువురు బీఎల్​ ఎకు చెందిన వారి మృతదేహాల చిత్రాలను విడుదల చేస్తూ ఆపరేషన్​ పూర్తయ్యిందని ప్రకటించింది. కానీ ఫ్యాక్ట్​ చెక్​ లో ఆ చిత్రాలు పాతవని తేలింది. క్వెట్టాకు 200 శవపేటికలు తీసుకువెళ్లినా వీటిపై సరైన సమాధానం ఇవ్వలేక దాటవేత ధోరణి కనిపించింది. బీఎల్​ ఎ బందీలుగా ఉన్న అందరి పేర్లను విడుదల చేసింది. కానీ పాక్​ సైన్యం ఆపరేషన్​ పూర్తి అయినా ఎందుకు పేర్లు అధికారికంగా విడుదల చేయలేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఆపరేషన్​ ఇంకా కొనసాగుతుందని స్పష్టం అవుతుంది.