హోళీ నాడే బ్లడ్ మూన్!
It's a blood moon on Holi!

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఈసారి హోళీ వేడుకలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మూడు రోజుల ముందు నుంచే మొదలయ్యాయి. ప్రధాన పర్వదినం మాత్రం మార్చి 14 (శుక్రవారం) నిర్వహించుకోనున్నారు. అయితే ఈసారి హోళి రోజు చంద్రుడు ఎర్రబడనున్నాడు. దీన్నే ‘బ్లడ్ మూన్’గా కూడా పిలుస్తుంటారు. ఈ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ దృశ్యం కేవలం 65 నిమిషాలపాటు కొనసాగనున్నట్లు ఖగోళ శాస్ర్తవేత్తలు వెల్లడించారు.
మరో ప్రత్యేకత ఏంటంటే ఈ ఏడాది సంభవించబోయే నాలుగు గ్రహాల్లో తొలి సంపూర్ణ చంద్రగ్రహణం కూడా సంభవించనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయాన్నే ఈ గ్రహణం సంభవిస్తుంది. భారత్ లో ఈ గ్రహణం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. అయితే ఇది భారత్ లో కనిపించదని నిపుణులు చెబుతున్నారు. విదేశాల్లో రాత్రి సమయం అవుతుంది కాబట్టి అక్కడ ఈ గ్రహణం వీక్షించే అవకాశం ఉంటుంది.