హోళీకి భారీ బందోబస్తు

Heavy security arrangements for Holi

Mar 13, 2025 - 13:58
 0
హోళీకి భారీ బందోబస్తు

లక్నో: సంభాల్​ జామా మసీదు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మసీదు చుట్టు రక్షణగా పరదాలను ఏర్పాటుచేశారు. శుక్రవారం హోలీ వేడుక కావడం, నమాజ్​ వేడుకలు నిర్వహించనుండడంతో యూపీ ప్రభుత్వం పకడ్భందీ చర్యలను చేపట్టింది. గురువారం నుంచి యూపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని మసీదులపై రంగులు పడకుండా, ఉద్రిక్తతలు తలెత్తకుండా పకడ్భందీ చర్యలు తీసుకుంది. హోలీ వేడుకలయ్యాక ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఇప్పటికే యూపీ అధికారులు పలువురు మసీదు నిర్వాహకులతో శాంతి కమిటీలో చర్చల సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు ఇరు పక్షాలు కూడా అంగీకరించాయి. షాజహాన్​ పూర్​, సంభాల్​, అలీఘర్​ లాంటి ప్రాంతాల్లో నిఘాను ముమ్మరం చేశారు. హోలీ ఊరేగింపుల వద్ద కూడా నిఘా పెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. అలీఘర్​ పోలీసు కమిషనర్​ అమిత్​ కుమార్​ భట్​ మాట్లాడుతూ.. ఇరువర్గాలు శాంతికమిటీ భేటీలో ఇరువురి పర్వదినాలు, ప్రార్థనలను శాంతియుతంగా జరుపుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎవరైనా కమిటీ తీసుకున్న నిర్ణయాలకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతియుతంగా పండుగ, ప్రార్థనలు నిర్వహించుకునేందుకు 3500మంది పోలీసులతో భద్రత కల్పించామన్నారు. పలు ఉద్రిక్తతలు తలెత్తే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో పోలీసులతో ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించామన్నారు. 250 సీసీ టీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని, డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. యూపీ వ్యాప్తంగా ప్రభుత్వం 14 జిల్లాల్లోని మసీదుల్లో ప్రార్థనల సమయాన్ని మార్చింది.