విద్యుదాఘాతానికి ఒకరు మృతి
One died due to electrocution
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: విద్యుత్ ఘాతానికి గురై ఒకరు మృతి చెందిన ఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండో కు చెందిన జి.సత్య అన్వేష్(22) కాసిపేట టూ ఇంక్లైన్ గనిలో కోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో ఉన్న తీగపై బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ పాస్ అవడంతో సత్య అన్వేష్ కు కరెంట్ షాక్ తగిలింది. గమనించిన స్థానికులు వెంటనే రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏరియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.