నక్సల్స్​ కోటకు బీటలు!

Naxals' stronghold is beaten!

Feb 9, 2025 - 14:56
 0
నక్సల్స్​ కోటకు బీటలు!

భారీ ఆపరేషన్లతో నక్సల్స్​ నుంచి విముక్తి

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: నక్సల్స్​ కంచుకోటకు బీటలు వారాయి. బస్తర్​ కోటలు రక్తపు మరకలతో ఎరుపెక్కాయి. గత కొన్ని రోజులుగా నక్సల్స్​ కు భద్రతా దళాలకు జరుగుతున్న పోరులో భారీ ఎత్తున నక్సల్స్​ ఎన్​ కౌంటర్లలో మృతి చెందుతున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ నక్సల్స్​ ఆపరేషన్​ సత్ఫలితాలనిస్తున్నా, ఇంతపెద్ద ఎత్తున ప్రాణాలు పోవడం పట్ల పలువురికి ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కేంద్రం చేపట్టిన ఆపరేషన్​ వల్ల కర్ణాటక పూర్తి నక్సల్స్​ రహిత రాష్​ర్టంగా ప్రకటించారు. చత్తీస్​ గఢ్​ లోని బస్తర్​ కోటను బద్ధలు కొడితే అన్ని రాష్ర్టాల్లోని నక్సల్స్​ ఆపరేషన్​ లు పూర్తిగా నిలిపివేస్తారనే ఆపరేషన్​ కు అంకురార్పణ చుట్టి బస్తర్​ నే భద్రతా బలగాలు టార్గెట్​ గా చేసుకున్నాయి. దీంతో కేంద్రం గతేడాదిగా చేపడుతున్న యాంటీ నక్సల్స్​ ఆపరేషన్​ లో భారీ సంఖ్యలో నక్సల్స్​ బడా నాయకులు, కమాండర్లు, ఆయా రాష్​ర్టాల నక్సలైట్లు మృతి చెందారు. ఎంతోమంది లొంగిపోయారు. ఈ ఆపరేషన్​ లో ఓ వైపు చత్తీస్​ గఢ్​ లోని నక్సల్స్​ కు కంచుకోటలుగా ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం అభివృద్ధిచేస్తూ స్థానిక గ్రామాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అభివృద్ధికి స్థానిక గ్రామీణ వాసులు ప్రాధాన్యతనిస్తుండడంతో నక్సల్స్​ కు భారీ ఎదురు దెబ్బలు తప్పడం లేదు. దీంతో వారి నెట్​ వర్క్​ పూర్తిగా దెబ్బతింది. కాగా కేంద్రం చేపట్టిన ఈ ఆపరేషన్​ లో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తుండడంతో నక్సలైట్ల కదలికలను నిఘా వర్గాలు ముందే గుర్తించగలుగుతున్నాయి. అదీగాక సమాచారం అందిన వెంటనే అలక్ష్యం చేయకుండా నిఘా వర్గాలను సైతం అప్రమత్తం చేస్తూ ఒకేసారి భారీ భద్రతా బలగాలతో చుట్టుముడుతుండడంతో నక్సల్స్​ కు ఎదురుదెబ్బలు తప్పడం లేదు. సాంకేతికత సహాయంతో చత్తీస్​ గఢ్​ ను పూర్తి నక్సల్స్​ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దుతామని కేంద్రం ప్రకటించింది. 

2025లో..
2025 ఫిబ్రవరి 9న జరిగిన ఎన్​ కౌంటర్​ లో 31 మంది నక్సలైట్లు మృతి చెందారు.
జనవరి 5న జరిగిన ఎన్​ కౌంటర్​ లో ఐదుగురు మృతి చెందారు.
జనవరి 16న ఉసూర్​ బ్లాక్​ లోని పూజారి కాంకేర్​ లో 18 మంది మృతి చెందారు.
జనవరి 21న గరియాబంద్​ లో జరిగిన ఎన్​ కౌంటర్​ లో 16 మంది మృతి చెందారు. 

2024లో..
మార్చి 27న బీజాపూర్​ జిల్లా చీపురభట్టిలో ఇద్దరు నక్సల్స్​ మృతి.
ఏప్రిల్​ 2న బీజాపూర్​ గంగాలూరులో 13 మంది మృతి.
ఏప్రిల్​ 6న తెలంగాణ–చత్తీస్​ గఢ్​ సరిహద్దులో ఎన్​ కౌంటర్​ లో ముగ్గురు మృతి చెందారు.
ఏప్రిల్​ 16న 29 మంది మృతి.
ఏప్రిల్​ 30న 10 మంది మృతి.
మే 10న బీజాపూర్​ పీడియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​ కౌంటర్​ లో 12 మంది నక్సల్స్​ హతమయ్యారు.
మే 23, 24 తేదీలలో నారాయణ్​ పూర్​, అబూజ్​ మడ్​ లో జరిగిన ఎన్​ కౌంటర్​ లో 8మంది మృతి చెందారు.
మే 25న సూక్మా, బీజాపూర్​ ఎన్​ కౌంటర్​ లో ముగ్గురు మృతి చెందారు.
జూన్​ 8న అబూజ్​ మడ్​ అమ్దాయ్​ ప్రాంతంలో జరిగిన ఎన్​ కౌంటర్​ లో ఆరుగురు నక్సల్స్​ మృతి చెందారు.
జూన్​ 15న నారాయణ్​ పూర్​ లో జరిగిన ఎన్​ కౌంటర్​ లో 8మంది మృతి.
సెప్టెంబర్​ 3న దంతేవాడ – బీజాపూర్​ సరిహద్దు లో 9మంది నక్సల్స్​ మృతి చెందారు.
సెప్టెంబర్​ 5న చత్తీస్​ గఢ్​– తెలంగాణ సరిహద్దులో ఆరుగురు నక్సల్స్​ మృతి చెందారు.
అక్బోర్​ 4 తుల్​ తులీ వద్ద జరిగిన ఎన్​ కౌంటర్​ లో 38 మంది నక్సల్స్​ మృతి చెందారు. 
నవంబర్​ 22న సూక్మా థానా బెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్​ కౌంటర్​ లో 10 మంది మృతి చెందారు.