మంత్రివర్గ భేటీలో మహిళలకు గౌరవ వేతనంపై నిర్ణయం

బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా

Feb 9, 2025 - 15:25
 0
మంత్రివర్గ భేటీలో మహిళలకు గౌరవ వేతనంపై నిర్ణయం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ తొలి బీజేపీ మంత్రివర్గ భేటీలో ఏం నిర్ణయం తీసుకుంటారనే విషయంపై రోహిణి బీజేపీ ఎమ్మెల్యే విజేత విజేంద్ర గుప్తా ఆదివారం మీడియాతో మాట్లాడారు. తొలిభేటీలో మహిళలకు గౌరవ వేతనంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. మోదీ విజన్​ తోనే ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లడం వల్లనే తన విజయం సునాయాసమైందన్నారు. ఈ విజయం ఢిల్లీ వాసులకే దక్కుతుందన్నారు. ప్రజలు మోదీ హామీలను ప్రజలు విశ్వసించారని, దేశ విజన్​ కు ఆయన పాటుపడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అందుకే పార్టీకి అతిపెద్ద విజయాన్ని అందించారని విజేంద్ర గుప్తా స్పష్టం చేశారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, యమునా నది శుభ్రపరిచే పని, కాలుష్యం తగ్గింపు వంటి పనులు సక్రమంగా చేపడతామని గుప్తా స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థి రేసు విషయాన్ని ప్రస్తావిస్తూ అధిష్ఠానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటామని తెలిపారు.