మిల్కీపూర్ గెలుపు ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు
ఎస్పీ నాయకుడు అవదేశ్ ప్రసాద్

లక్నో: యూపీ మిల్కీపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో ఎస్పీ ప్రముఖ నాయకుడు అవదేశ్ ప్రసాద్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై తిరుగుబాటు జరిగిందని ఆరోపించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేసి లబ్ధి పొందారని ఆరోపించారు. ఎన్నో ఎన్నికలను చూశామని, ఎన్నికల కమిషన్ పై ఏం ఒత్తిడి ఉందో తెలియదని, బీజేపీకి అనుకూలంగానే ఈసీ వ్యవహరించిందని ఆరోపించారు. కాగా మిల్కీపూర్ నుంచి బీజేపీ తరఫున చంద్రభాను పాశ్వాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈయనకు పోటీగా సమాజ్ వాదీ పార్టీ నుంచి అజిత్ ప్రసాద్ రంగంలో ఉన్నారు. పాశ్వాన్ 1,46,397 ఓట్లు లభించగా, ప్రసాద్ కు 84,687 ఓట్లు మాత్రమే లభించాయి. పాశ్వాన్ 61వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.