దర్భార్, అశోక హాల్ పేర్లు మార్పు!
గణతంత్ర మండపం, అశోక మండపం భారత సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగానే మార్పు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి భవన్ లోని దర్బార్, అశోక హాళ్లను గణతంత్ర మండపం, అశోక మండపంగా పేర్లు మార్చినట్లు అధ్యక్ష కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం ఇవి భారతదేశంలోని అమూల్యమైన వారసత్వ సంపద పేర్లను పెట్టడం హర్షణీయమని పేర్కొంది.
గతంలోని ఈ పేర్లు భారత పాలకులు, బ్రిటిషర్ల పేర్లను ప్రతిబింబిస్తున్నాయని, అందుకే వీటిని మార్చామన్నారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలు మార్చిన పేర్లలో ప్రతిబింభిస్తున్నాయన్నారు.
గణతంత్ర మండపం (దర్భార్), అశోక మండపం (అశోక హాల్) ఎన్నో చారిత్రాత్మక కార్యక్రమాలకు వేదికలుగా నిలుస్తున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఔచిత్వాన్ని కోల్పోయినందున ఈ పేర్లను మార్చామని ప్రకటనలో పేర్కొన్నారు.