మహాకుంభ్​ లో బాంబు పేలుళ్ల హెచ్చరిక

Warning of bomb blasts in Mahakumbh

Jan 1, 2025 - 16:39
 0
మహాకుంభ్​ లో బాంబు పేలుళ్ల హెచ్చరిక

విచారణ చేపట్టిన అధికారులు

లక్నో: మహాకుంభ్​ లో బాంబు పేలుళ్లు చేస్తామని నాసర్​ పఠాన్​ అనే వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. బుధవారం ప్రయాగ్​ రాజ్​ పోలీస్​ కమిషనర్​ కి, భద్రత సంస్థలకు ఈ హెచ్చరికలను పంపారు. హెచ్చరికలు జారీ చేసిన వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. డిసెంబర్​ 31న విపిన్​ గౌర్​ అనే యువకుడు సోషల్​ మీడియాలో వచ్చిన పోస్టును యూపీ పోలీసులకు ట్యాగ్​ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్​ 24న కుడా ఖలిస్థానీ ఉగ్రవాది పన్ను మహాకుంభ్​ పై దాడి చేస్తామని హెచ్చరించాడు. 

జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహాకుంభ్ ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. సుమారు 50 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్​ర్ట ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 

18,479 మంది పురుష పోలీసులు, 1378 మంది మహిళా పోలీసులు, 1405 మంది ట్రాఫిక్ పోలీసులు, సాయుధ పోలీసులు 1158, 146 మంది మౌంటెడ్, ఘాట్‌ల వద్ద 340 మంది వాటర్‌ పోలీసు సిబ్బందిని నియమించారు. 13,965 మంది హోంగార్డులను కూడా నియమించనున్నారు. ఇక 510 మంది ఇంటలిజెన్స్​ సిబ్బందిని కూడా మఫ్టీలో విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.  మొత్తం 40వేలకు పైగా పోలీసులను భద్రతా విధులను కేటాయించారు.