తెలంగాణలో మోదీ మేనియా
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలవి డైవర్షన్ పాలిటిక్స్: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం సికింద్రాబాద్ ఎస్వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో సీనియర్ నాయకులు పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె పీఎల్ అలేఖ్య, వారి అనుచరులతో కమలం పార్టీలో చేరారు. వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీకి పెరుగుతున్న బలం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న పీఎల్ శ్రీనివాస్, ఆయన కుమార్తె అలేఖ్య, వారి అనుచరులతో పార్టీలో చేరడం పార్టీకి బలం చేకూరుస్తుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి, ప్రధాని మోదీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా.. ఈసారి తమ ఓటు బీజేపీకి, మోదీకి వేస్తామని రైతులు, యువత, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజలు చెప్తున్నారని తెలిపారు. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లేని అంశాలను తెరమీదకు తెస్తూ.. మోదీ అనుకూల వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వచ్చేది మోదీ ప్రభుత్వమే. అందులో ఎలాంటి అనుమానం లేదు. తెలంగాణ అన్నివర్గాల ప్రజలను కోరుతున్నాను బీజేపీని బలపర్చాలి”అని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
సేవాలాల్ చూపిన బాటలో నడవాలి..
నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా బీజేపీ వైభవంగా నిర్వహిస్తున్నదన్నారు. బ్రిటీష్ వారు అధికార దుర్వినియోగంతో మత మార్పిడులకు పాల్పడ్డారని, దానికి వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాటం చేశారని గుర్తు చేశారు. సంతు సేవాలాల్ తెలుగు రాష్ట్రాల్లో జన్మించి.. ఉద్యమాన్ని ప్రారంభించారని