వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్త
Media should be careful while writing news

పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మీడియాలో ఏవైనా ప్రకటనలు, వార్తలు, అభిప్రాయాలను ప్రచురించే ముందు అత్యంత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా హక్కు అత్యంత ముఖ్యమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పలు మీడియా సంస్థలపై పరువునష్టం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ కేసును కొట్టివేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జర్నలిస్టులు దాఖలు చేసిన అప్పీల్ ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. కత్తి కంటే కలం గొప్పదని ఓ ఆంగ్ల రచయిత చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. విస్తృత పరిధిని దృష్టిలో ఉంచుకొని ఒక వ్యాసం, నివేదిక లక్షలాది మందిని ఆకట్టుకుంటుదని, వారి నమ్మకాలు, తీర్పులను రూపొందిస్తుందని కోర్టు పేర్కొంది. సంబంధిత వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలిగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉందని గుర్తుంచుకోవాలని, ఈ పరిణామాలు శాశ్వతంగా ఉండేవిగా ఉంటాయని తెలిపింది. వ్యక్తులు, సంస్థలు, సమగ్రతను ప్రభావితం చేసే విషయాలతో వ్యవహరించేటప్పుడు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా కేసులో ఫిర్యాదుదారులు సాక్ష్యాలను అందించడంలో విపలమయ్యారని తీర్పును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.