బడ్జెట్​ కు ముందు శ్వేతపత్రం విడుదలకు డిమాండ్​

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర

Feb 19, 2025 - 15:52
 0
బడ్జెట్​ కు ముందు శ్వేతపత్రం విడుదలకు డిమాండ్​

బెంగళూరు: రాష్ట్ర బడ్జెట్​ ను విడుదల చేసేముందు కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర డిమాండ్​ చేశారు. ఈ అంశంపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చి 7న రాష్ట్ర బడ్జెట్​ ప్రవేశపెట్టే ముందు సీఎం సిద్ధరామయ్య శ్వేతపత్రం సమర్పించాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో లేదన్నారు. ఆర్థిక భారంతో సతమతం అవుతూ రాష్ట్రాన్ని దివాలా దిశయగా పయనింపచేస్తుందని ఆరోపించారు. ప్రతీ ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్​, ప్రతీ మహిళకు రూ. 2వేలు, బీపీఎల్​ కుటుంబానికి ఒక్కరికి పదికిలోల బియ్యం హామీలు నీటిమూటలుగానే మిగిలాయని ఆరోపించారు. అమలుకు చేతగానీ హామీలు ఎందుకిచ్చారని సిఎం సిద్ధరామయ్యను నిలదీశారు.