40ఏళ్లుగా మూతపడిన ఆలయం! శుద్ధి పనులు ప్రారంభం
The temple has been closed for 40 years! Start of cleaning works
సీఎం యోగి చర్యలతోనే ముందడుగన్న పూజారి
లక్నో: ఉత్తరప్రదేశ్ వారణాసిలో 40ఏళ్లుగా మూతపడిన శివాలయంలో పునరుద్ధరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. శుద్ధి పనులు పూర్తికాగానే ఆలయాన్ని తెరిచి పూజలు ప్రారంభిస్తామని మొరాదాబాద్ గౌరీ శంకర్ ఆలయ పూజారి బుధవారం మీడియాకు వివరించారు. ఈ ఆలయం గత 40 ఏళ్లుగా మూతపడి ఉందన్నారు. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఆలయాన్ని తెరిచేందుకు ఎవ్వరూ సాహసించలేదన్నారు. ప్రస్తుతం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చొరవతో భారీ బందోబస్తు ఉండడంతో ఆలయ పునరుద్ధరణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఆలయం తెరుచుకున్నాక నిత్య పూజలు నిర్వహిస్తామన్నారు. ఆలయం తెరవడాన్ని కూడా స్థానిక ముస్లిం పక్షాలు వ్యతిరేకించగా, హిందూ పక్షం బలమైన చర్యలు చేపట్టడంతో వారి ఆటలు కొనసాగలేదు. దీంతో ఆలయ పాలకవర్గం సమక్షంలో తలుపులు తెరిచి శుభ్రం చేసే చర్యలు తీసుకుంటున్నారు. పరిస్థితుల నేపథ్యంలో ఆలయ భద్రత, పూజల నిర్వహణకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.