సంభాల్ మసీదు జిల్లా కోర్టు విచారణపై హైకోర్టు స్టే
High Court stays Sambhal Masjid district court trial
లక్నో: యూపీలోని సంభాల్ ఆలయ మసీదు వివాదానికి సంబంధించిన జిల్లా కోర్టు కేసు విచారణపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. రాయల్ జామా మసీదు దాఖలు చేసిన పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు బుధవారం విచారించింది. పిటిషన్ పై తమ తమ అభిప్రాయాలను ఇరుపక్షాలు కోర్టుకు నాలుగువారాల్లోకి నివేదిక రూపంలో సమర్పించాలని తెలిపింది. పిటిషన్ దాఖలు చేసిన మసీదు కమిటీ రెండు వారాల్లోకా తన పిటిషన్ ను దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోహిత్ రంజన్ అగర్వాల్ సింగిల్ బెంచ్ విచారణ చేపట్టారు. ఫిబ్రవరి 25కు విచారణను వాయిదా వేశారు. ఈ కేసును ఇప్పటికే హిందు పక్షాలు జిల్లా కోర్టుతోపాటు, హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి.