సివిల్స్ ఫలితాల్లో మనోళ్ల ఘనత
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ - 2023 ఫైనల్ ఫలితాలు వెల్లడయ్యాయి.
నా తెలంగాణ, ఢిల్లీ : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ - 2023 ఫైనల్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీ 165 , ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది ఎంపిక కాగా ఐఎఫ్‌ఎస్‌కు 37, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ - ఎ కేటగిరీలో 613 మంది, గ్రూప్ బి సర్వీసెస్‌లో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు రాగా, అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో సత్తా చాటారు.
అభ్యర్థుల ర్యాంకులు :
ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు
అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు
దోనూరు అనన్యరెడ్డికి మూడో ర్యాంకు
నందల సాయికిరణ్‌కు 27వ ర్యాంకు
మేరుగు కౌశిక్‌కు 22వ ర్యాంకు
పెంకీసు ధీరజ్‌రెడ్డికి 173వ ర్యాంకు
జి.అక్షయ్ దీపక్‌కు 196వ ర్యాంకు
గనసేన భానుశ్రీకి 198వ ర్యాంకు
నిమ్మనపల్లి ప్రదీప్‌రెడ్డికి 382వ ర్యాంకు
బన్న వెంకటేష్‌కు 467వ ర్యాంకు
పూల ధనుష్‌కు 480వ ర్యాంకు
కె.శ్రీనివాసులుకు 526వ ర్యాంకు
నెల్లూరు సాయితేజకు 558వ ర్యాంకు
పి.భార్గవ్‌కు 590వ ర్యాంకు
కె.అర్పితకు 639వ ర్యాంకు
ఐశ్వర్య నెల్లి శ్యామలకు 649వ ర్యాంకు
సాక్షి కుమారికి 679వ ర్యాంకు
చౌహన్ రాజ్‌కుమార్‌కు 703వ ర్యాంకు
జి.శ్వేతకు 711వ ర్యాంకు
వి.ధనుంజయకుమార్‌కు 810వ ర్యాంకు
లక్ష్మీ భానోతుకు 828వ ర్యాంకు