చైనా ఆక్రమణలకు అమెరికా మోకాలడ్డు
రిసాల్వ్ టిబెట్ యాక్ట్ కు సెనెట్ ఆమోదం జూన్ 18న భారత్ రానున్న నాన్సీ పెలోసీ
వాషింగ్టన్: చైనా ఆక్రమణలకు అమెరికా మోకాలడ్డింది. టిబెట్ పై చైనా ఆక్రమణకు వ్యతిరేకంగా గురువారం అమెరికా సెనెట్ ఇరు సభల్లో 'రిసాల్వ్ టిబెట్ యాక్ట్' బిల్లు ఆమోదం పొందింది. శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ టిబెటన్ అధికారి సిక్యోంగ్ పెన్పా త్సెరింగ్ అమెరికన్ చట్టసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేశారు. జూన్ 18న దలైలామాను కలిసేందుకు అమెరికా మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ భారత్ హిమాచల్ ప్రదేశ్ కు రానున్నారు. జీ–7 సదస్సు ముగిశాక ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయనున్నారు. కాగా ఈ బిల్లు ఆమోదంపై చైనా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. బిల్లు ఆమోదంతో అహింసా మార్గంపై పోరాడేందుకు టిబెటన్లకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
13వ శతాబ్ధం నుంచి టిబెట్ చైనాలో అంతర్బాగమని చైనా చెబుతోంది. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించింది. దీన్ని దలైలామా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనపై చైనా యుద్ధాన్ని ప్రకటించింది. దీంతో దలైలామాకు భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ పరిణామం కూడా భారత్ –చైనా 1962 యుద్ధానికి ఒక కారణంగా చెబుతారు. కాగా టిబెట్ స్వాతంత్ర్యనికి పెలోసీ విశేష కృషి చేశారు.