కేజ్రీ, అతిషిలను నిలదీస్తా: స్వాతి మాలివాల్
Kejri and Atishi will be suspended: Swati Maliwal
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: చాలా రోజుల తరువాత ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ గురువారం మీడియా ముందుకొచ్చారు. కేజ్రీవాల్, అతిషిలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇక బరిలోకి దిగి వారి అనుచిత చర్యలను తిప్పికొడతానన్నారు. గత ఏడేళ్లుగా మురికివాడ ప్రజల బాగోగుల కోసం తాను శాయశక్తులా కృషి చేశానన్నారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేయబోనన్నారు. తనకు ఆప్ పదవులతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అట్టడుగు స్థాయి వర్గాలకు మేలు చేసే వ్యక్తిగానే ఉంటానన్నారు. వారి గళాన్ని ప్రభుత్వాలకు బలంగా వినిపిస్తానన్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉండగా లక్షా 70వేల కేసులకు పైగా విచారించి న్యాయం చేకూర్చగలిగానని తెలిపారు. తన కృషి వల్లే అత్యున్నత స్థాయికి ఎదిగానన్నారు. కానీ ఆప్ కేజ్రీవాల్, పార్టీలోని ఇతర నేతలు తనను అణగదొక్కాలని, తాను బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని, తాను ఇంతవరకూ ఎన్నికల ప్రచారంలోనే పాల్గొనలేదన్నారు. తాను ఎవ్వరి తరఫున పాల్గొనబోనన్నారు. కానీ ఇక బరిలోకి దిగి కేజ్రీవాల్, అతిషిల భరతం పడతానని నిజనిజాలను ప్రజలకు వివరిస్తానని స్వాతి మాలివాల్ అన్నారు.