పిస్టల్ పేలి ఎమ్మెల్యే మృతి
పంజాబ్ ఆప్ లో విషాద ఛాయలు
చండీగఢ్: ఆప్ పంజాబ్ లూథియా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. లైసెన్సుడు పిస్టల్ ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లి శుక్రవారం 12 గంటలకు మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రమాదవశాత్తు బుల్లెట్ పేలడంతోనే మృతిచెందారని ప్రకటించారు. బుల్లెట్ తగిలిన వెంటనే గోగిని కుటుంబ సభ్యులు డీఎంసీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. లూథియానా డీసీపీ జస్కరన్ సింగ తేజా సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యుల ద్వారా ఆరా తీశారు. గోగి 2022లో కాంగ్రెస్ పార్టీని వీడి ఆప్ లో చేరారు. ఈయన రెండుసార్లు లూథియానా వెస్ట్ కు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా పోలీసులు,కుటుంబ సభ్యులు ప్రమాదంగా అభివర్ణిస్తున్నా, ఈ ఉదంతంపై ఆయన సన్నిహితులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆప్ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా ఈ ఘటనపై స్పందిస్తూ గోగి మృతి ఆప్ పార్టీకి తీరని లోటని సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ పరంగా తమకు నష్టమన్నారు. కాగా ప్రమాదానికి కొన్ని గంటల ముందు గోగి అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్, ఆప్ ఎంపీ బల్బీర్ సింగ్ షీచెవాల్ తో సమావేశమయ్యారు.