అనిశ్చితిలోనూ భారత్​ వృద్ధి 6.6 శాతం

యూఎన్​ అధికారి రషీద్​

Jan 10, 2025 - 20:12
 0
అనిశ్చితిలోనూ భారత్​ వృద్ధి 6.6 శాతం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రపంచ వ్యాప్త అనిశ్చిత పరిస్థితుల్లోనూ భారత్ ఆర్థిక​ వృద్ధి అత్యంత పటిష్టంగా ఉందని గ్లోబల్​ ఎకనామిక్​ మానిటరింగ్​  యూఎన్​ ఉన్నతాధికారి హమీద్​ రషీద్​ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్​ 6.6 శాతం వార్షిక వృద్ధి రేటుతో ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. గురువారం ‘వరల్డ్​ ఎకనామక్​ సిట్యూయేషన్​ అండ్​ ప్రాస్పెక్ట్స్​ 2025 (డబ్ల్యూఇఎస్​పీ) నివేదిక విడుదలను రషీద్​ ఊటంకించారు. నివేదికలోని పలు వివరాలను అందించారు. ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్‌లో బలమైన ఎగుమతి వృద్ధి కొనసాగిస్తుందన్నారు. బలమైన ఆర్థిక విధానాల వల్ల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మూలధన వ్యయం రాబోయే కాలంలో వృద్ధి సాధిస్తుందన్నారు. సరఫరా, ఉత్పత్తి, సేవల రంగాలలో భారత్​ విస్తరిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలోనూ 2024లో అనుకూల ఫలితాలు భారత్​ సాధించిందన్నారు. గత సంవత్సరం ఫలితాలు 2025 సంవత్సరంలో వ్యవసాయ ఉత్పాదక అంచనాలను మరింత పెంచనున్నాయని తెలిపారు. గత ఏటా 6.8 శాతం వృద్ధి అంచనా స్వల్పంగా తగ్గినా భారత్​ స్థిరమైన వృద్ధిని సాధించిందన్నారు. స్వల్ప తగ్గుదల కూడా ప్రపంచదేశాల పరిణామాల దేశాల వల్ల జరిగిందన్నారు. అదే సమయంలో యూఎస్​ (అమెరికా) ఆర్థిక వృద్ధి గత సంవత్సరంలో 2.8 శాతం సాధించిందని, ప్రస్తుత ఏడాది వృద్ధి అంచనా 1.9 శాతంగా అంచనా వేసినా 0.9 శాతానికి తగ్గిందన్నారు. దక్షిణాసియాలో మిశ్రమంగా ఆర్థిక వృద్ధి కొనసాగుతుందని, భారత్​ వృద్ధి మాత్రం ఆశించిన స్థాయిలోనే ఉందని హమీద్​ రషీద్​ అన్నారు.