ట్రంప్ ను ఓడించేవాన్నే!
పార్టీ ఐక్యత కోసమే అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నా: జో బైడెన్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్టీని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తాను అధ్యక్ష పదవికి పోటీ చేయలేదని, తాను పోటీ చేస్తే ట్రంప్ ను సునాయాసంగానే ఓడించగలిగేవాడినని జో బైడెన్ మీడియాతో అన్నారు. కమలా హారీస్ చేసిన ప్రయత్నం గొప్పదన్నారు. డెమోక్రటిక్ పార్టీ ఐక్యత కోసమే అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. అయినా ట్రంప్ ను ఓడించినట్లుగానే భావిస్తున్నట్లు తెలిపారు. జూన్ లో జరిగిన చర్చ సందర్భంగా బిడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పార్టీ వర్గాలు వ్యతిరేకించాయి. అదీగాక పలు సమావేశాలు, సదస్సుల్లో బైడెన్ వృద్దాప్యం కారణంగా అభాసుపాలయ్యారు. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారీస్ కు అవకాశం దక్కింది. ఆమెతో ట్రంప్ ముఖాముఖి పాల్గొని ఎన్నికల్లో విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సత్తా కమలా హారీస్ కే ఉందని భావిస్తున్నట్లు జో బైడెన్ స్పష్టం చేశారు.