కుంభమేళా.. రికార్డులు బద్ధలే!
Kumbh Mela.. records are broken!
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: మహాకుంభ మేళాలో పాల్గొనే భక్తుల సంఖ్యే కాదు.. ప్రతీ ఏర్పాట్లు కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల్లోకి ఎక్కనున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు (45)రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికారిక లెక్కల ప్రకారం పలు వివరాలు..
జనసంఖ్య..
భారత జనాబా 146 కోట్లు, చైనా జనాభా 142 కోట్లు, అమెరికా జనాభా 35 కోట్లు, పాకిస్థాన్ జనాభా 24 కోట్లు, రష్యా జనాభా 14 కోట్లు. కుంభమేళాకు 40 నుంచి 50 కోట్ల జనాభా వస్తారని అంచనా. అంటే అమెరికా జనాభా కంటే ఎక్కువ, పాక్ జనాభా కంటే రెండు రెట్లు, రష్యా జనాభా కంటే మూడు రెట్లు ఎక్కువ.
స్థలం..
ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియం కంటే 160 రెట్లు మేళా స్థలం. నరేంద్ర మోదీ స్టేడియం 25 హెక్టార్లు అంటే 160 స్టేడియంలంతా స్థలాన్ని కేవలం మేళా ప్రాంతం కోసమే ఉపయోగిస్తున్నారు. ఇతర సౌకర్యాలకు ఉపయోగించే స్థలం అదనం. ప్రపంచంలోని వెటికన్ సిటి కంటే మూడు రెట్లు ఎక్కువ.
బియ్యం, గోధుమలు..
ఒక్కరోజుకు కుంభమేళాలో ఉపయోగించే బియ్యం 1100 క్వింటాళ్లు, గోధుమలు, 1600వందల క్వింటాళ్లు.
కుంభమేళా ఖర్చు రూ. 6382 కోట్లు..
అయోధ్య రామ మందిర నిర్మాణానికి రూ. 1800 కోట్లు ఖర్చు కాగా, స్టేట్యూ ఆఫ్ లిబర్టీకి రూ. 3వేల కోట్లు, నూతన పార్లమెంట్ భవన్ కు రూ. 971 కోట్లు, కుంభమేళాకు రూ. 6382 కోట్లు.
రాబడి అంచనా రూ. 1,20,000కోట్లు..
కుంభమేళాకు ఐపీఎల్ సంపాదన కంటే పదిరెట్లు ఎక్కువగా రాబడి ఉండవచ్చని అంనా వేస్తున్నారు. బూర్జ్ ఖలిఫా కు 2023లో రూ. 6000 కోట్లు రాబడి రాగా, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ. 4,400 కోట్లు విరాళాలు అందాయి. ఐపీఎల్ కు రూ. 12వేల కోట్ల ఆదాయం సమకూరింది. కానీ కుంభమేళాకు రూ. 1,20,000 కోట్ల ఆదాయం సమకూరునున్నట్లు అంచనా వేస్తున్నారు.
40 కోట్లమంది భక్తులు వస్తారని అంచనా..
కుంభమేళాలో వివిధ ప్రాంతాల్లో భక్తులు పెద్ద యెత్తున వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రయోగరాజ్ 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. 2019లో ఈ సంఖ్య 24 కోట్లుగా నమోదైంది. 2013లో 12 కోట్లు, 2015లో 75 లక్షలు (నాసిక్ త్రయంబకేశ్వర్), 2016లో 7.5 కోట్లు (ఉజ్జయినీ దేవాలయం) భక్తుల దర్శనాలతో రికార్డుల్లో ఉన్నాయి.