రెండెళ్లలోనే రూ. 37 లక్షల కోట్లకు పెరిగిన దేశీయ పెట్టుబడులు

Within two years Rs. Domestic investments increased to 37 lakh crores

Jan 23, 2025 - 15:50
 0
రెండెళ్లలోనే రూ. 37 లక్షల కోట్లకు పెరిగిన దేశీయ పెట్టుబడులు

ఎస్​ బీఐ 2023–24 వార్షిక నివేదికలో వెల్లడి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: గత రెండేళ్లలో దేశీయ పెట్టుబడుల ప్రకటనలు రూ. 37 లక్షల కోట్లు దాటాయని ఎస్​ బీఐ గురువారం విడుదల చేసిన 2023–24 వార్షిక నివేదికలో పేర్కొంది. 2024–25లో తొలి తొమ్మిది నెలల్లోనే రూ. 32 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేసింది. గతేడాది ఇదే కాలంలో రూ. 23 లక్షల కోట్ల కంటే చాలా ఎక్కువని పేర్కొంది. 2021లో రూ.10 లక్షల కోట్లు వాటా 50 శాతంతో పోలీస్తే భారీ పెరుగుదుల నమోదైందని స్పష్టం చేసింది. పెట్టుబడులలో ప్రభుత్వ, ప్రైవేటు రంగం కీలకంగా దోహదం చేశాయి. 2022–23లో దాదాపు 68 శాతానికి పెరిగిందన్నారు. మొత్తం పెట్టుబడులలో 70 శాతం కంటే ఎక్కువ ప్రైవేట్​ రంగం వాటా ఉంటుందని నివేదిక పేర్కొంది. 

2024–25 తొలి తొమ్మిది నెలల్లో రూ. 5, 97, 92 కోట్ల 1,493 పెట్టుబడి ప్రకటనలు వచ్చాయి. 1,172 ప్రాజెక్టులతో విద్యుత్​ రంగం రూ. 13, 58, 783 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. మైనింగ్​ రంగం రూ. 56, 628 కోట్లతో 72 ప్రాజెక్టులను చేపట్టింది. చమురు, గ్యాస్​ రంగం రూ. 35,623 కోట్ల విలువైన 62 ప్రాజెక్టులను దక్కించుకున్నాయి. ఈ గణాంకాలు రానున్న సమయంలో స్థిరమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తుంది. ఆర్థిక కార్యకలాపాలను పెంచేందుకు, కీలక రంగాలలో పెట్టుబడులు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు జరుగుతున్న ప్రయ్నత్నాలను ప్రతిబింబిస్తున్నాయని ఎస్​ బీఐ నివేదికలో స్పష్టం చేసింది.