మొఘలుల కాలంలో ధ్వంసమైన 160 ఆలయాల పునరుద్ధరణ
ఆక్రమణదారుల చెర నుంచి విముక్తి.. కేరళలో ఉగ్ర నరసింహా ట్రస్టు విశేష కృషి.. ఇప్పటికే 8 ఆలయాల్లో పూజలు ప్రారంభం .. ప్రగతిలో మరో ఐదు దేవాలయాల పునర్మిర్మాణం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్:
మొఘలులు, టిప్పు సుల్తాన్ పాలనలో ఆక్రమణదారుల దాడుల్లో కేరళలో ధ్వంసమైన 160 ఆలయ నిర్మాణాలకు క్రమేణా మహార్దశ చోటు చేసుకుంటోంది. 1921లో మోప్లా తిరుగుబాటు సందర్భంగా చాలా ఆలయాలను ధ్వంసం చేశారు. ఆలయాలను పర్యవేక్షిస్తున్న అప్పటి కుటుంబాలను ఆయా చోట్ల నుంచి తరిమి వేశారు. ప్రస్తుతం దేవాలయ ప్రాంతాల్లోని చాలా చోట్ల ఆక్రమణదారులు తిష్ఠ వేసుకున్నారు.
ఆలయాలను పర్యవేక్షిస్తున్న అప్పటి కుటుంబాలు ఎన్నో ప్రయత్నాల తరువాత ఓ ట్రస్టును ఏర్పాటు చేసి పోరాటం చేసి సఫలీకృతమయ్యారు. కేరళలోని 160 ఆలయాలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఉగ్ర నరసింహా ట్రస్టును ఏర్పాటు చేసి కోర్టు వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ఆలయ నిర్మాణాలను చేపడుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ట్రస్టు ఆధ్వర్యంలో 8 ఆలయాల్లో పునర్మిర్మాణ పనులు పూర్తయి పూజలు ప్రారంభం కాగా, మరో ఐదు ఆలయాల పునర్మిర్మాణాలు చకచకా సాగుతున్నాయి. ఆలయ పునర్మిర్మాణాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతం వలవన్నూరు గ్రామంలో ఓ పురాతన దేవాలయం భూమిలో దుర్గ అమ్మవారి విగ్రహం లభించింది.
ఈ ఆలయ నిర్మాణానికి కూడా ఈ ట్రస్టు సభ్యులు స్వాధీనం చేసుకొని నిర్మించేందుకు తీవ్ర ప్రయాసలే పడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణానికి అన్ని రకాల కోర్టు అనుమతులు లభించాయి. ఆక్రమణదారులను ఖాళీ చేయించారు. అమ్మవారి ఆలయాన్ని చోళ దుర్గాదేవి ఆలయంగా తీర్చిదిద్దడంలో ఉగ్ర నరసింహా ట్రస్టు తీవ్రంగా కృషి చేస్తోంది. 2500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి.