చొరబాటుదారులను ఓటర్లుగా మారుస్తున్న కేజ్రీవాల్
బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపణ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేజ్రీవాల్ బంగ్లాదేశ్ చొరబాటుదారును ఓటర్లుగా మారుస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో 3 మది చొరబాటుదారులున్నారని ఆరోపించారు. ఒకే ఇంట్లో నుంచి 67 మంది ఓట్లను పట్టుకున్నామన్నారు. కేజ్రీవాల్ తో బీజేపీ పార్టీ పోల్చవద్దన్నారు. బీజేపీ 70కి 70 స్థానాలను గెలుచుకుంటుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ఉచిత పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. గతంలో కేజ్రీవాల్ ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ విజయం సాధించబోతుందని చెప్పారు. యువత, మహిళలు, వృద్ధులు, కాలుష్యం, నీరు, యమునా శుద్ధి, విద్య, వైద్యం లాంటి మౌలిక సదుపాయాలతోపాటు కేజ్రీవాల్ లాంటి అవినీతిపరులను మరోమారు జైలులో వేస్తామని మనోజ్ తివారీ పేర్కొన్నారు.