భారత్ కు పలు దేశాల గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Happy Republic Day to India from many countries
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: 76వ గణతంత్ర వేడుకుల సందర్భంగా ప్రపంచంలోని వివిధ దేశాల రాయబార కార్యాలయాలు భారతదేశానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం వేడుకల నిర్వహణను కొనియాడాయి. అమెరికా, చైనా, రష్యా, నేపాల్, యూఏఇ, ఫ్రాన్స్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఉబ్బెకిస్థాన్, కంబోడియా, వియత్నాం, జపాన్, ఇండోనేషియా సహా ప్రముఖ దేశాలు శుభాకాంక్షలు తెలిపిన దేశాల్లో ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని కీర్తించారు. భారత్ తో తమ దేశ బంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని కీర్తించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా భారత్ శక్తి సామర్థ్యాలను చాటడం పట్ల సైనిక సత్తాను కొనియాడారు. భారత్ అత్యున్నత దేశాలలో ఒకటని ప్రశంసించారు.