కత్రా–శ్రీనగర్​ వందేభారత్​ ట్రయల్​ రన్​ సక్సెస్​

Katra-Srinagar Vande Bharat trial run success

Jan 25, 2025 - 14:30
 0
కత్రా–శ్రీనగర్​ వందేభారత్​ ట్రయల్​ రన్​ సక్సెస్​

చీనాబ్​ వంతెన నుంచి మూడు గంటల్లోనే 160కి.మీ. ప్రయాణం
ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి

శ్రీనగర్​: జమ్మూకశ్మీర్​ కత్రా–శ్రీనగర్​ మధ్య వందేభారత్​ శనివారం ట్రయల్​ రన్​ విజయవంతమైంది. అత్యంత ఎత్తైన చీనాబ్​ వంతెన నుంచి  రైలు ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశారు. 10 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ట్రయల్​ రన్​ విజయవంతం కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ వందేభారత్​ ఫిబ్రవరి నుంచి ఈ వంతెన ద్వారా కత్రా–శ్రీనగర్​ కు నడవనుంది. 160 కిలోమీటర్ల దూరాన్ని కేవలం మూడు గంటల్లో అధిగమించనుంది. 244027 వందేభారత్​ ఎక్స్​ ప్రెస్​ రైలు శనివారం ఉదయం 8 గంటలకు కత్రా నుంచి బయలు దేరింది. అత్యంత ఎత్తైన వంతెన చీనాబ్​ పై నుంచి ప్రయాణించి చివరి స్టేషన్​ శ్రీనగర్​ కు ఉదయం 11గంటలకు చేరుకుంది. రైలు భోగీల్లో హీటింగ్​ సిస్టమ్​ వాటర్​ ట్యాంకులు, బయో టాయ్​ లెట్​ లను గడ్డకట్టకుండా వినియోగించారు. విండ్​ షీల్డ్​, ఎయిర్​ బ్రేక్​ సిస్టమ్​ లు మైనస్​ ఉష్ణోగ్రతల్లోనూ పనిచేసేలా వందేభారత్​ ను రూపొందించారు.