భారత్​–ఇండో బంధాలు బలోపేతం

Strengthening India-Indo ties

Jan 25, 2025 - 14:15
 0
భారత్​–ఇండో బంధాలు బలోపేతం

సీఈవో ఫోరం సదస్సులో ప్రధాని మోదీ
గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతిప్రభో పాల్గొనడం అభినందనీయం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–ఇండోనేషియాల బంధం ఈనాటిది కాదని వేల సంవత్సరాల నుంచి పటిష్ఠంగా ఉందని తమ హయాంలో మరింత బలోపేతం కావడం సంతోషకరమని రాష్ట్రపతి ప్రభో సుభేంటో భారత గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం హర్షణీయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం భారత్​–ఇండోనేషియా సీఈవో ఫోరంల మధ్య జరిగిన భేటీలో పాల్గొన్నారు. ఇరుదేశాల్లోని వ్యాపార, వాణిజ్య విషయాలు, ద్వైపాక్షిక బంధాలపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ర్టపతి ప్రభోతో రక్షణ, ఉత్పత్తి, మారిటైం, సైబర్​, కౌంటర్​ సెక్యూరిటీలపై విజయవంతమైన చర్చలు జరిగాయన్నారు. ఈ రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయన్నారు. భారత్​–ఇండోనేషియాల మధ్య వ్యాపారం 30 బిలియన్​ డాలర్లకు పైగా చేరుకుందన్నారు. దీన్ని మరింత పెంచేందుకు పటిష్ఠమైన చర్యలు ఈ సమావేశంలో తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్​ రంగాలు ఫిన్​ టెక్​ ఏఐ టెక్నాలజీ తదితర రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని నిర్ణయించాయన్నారు. హెల్త్​, ఫుడ్​, ఎనర్జీ, సైనస్​ అండ్​ టెక్నాలజీ రంగాల్లోనూ సీఈవో ఫోరంలో వ్యాపార వర్గాల ఆలోచనలు బాగున్నాయన్నారు. ఈ రంగాల్లోనూ కలిసి పనిచేయనున్నామని తెలిపారు. ఇండోనేషియా నిర్వహించనున్న బ్రిక్స్​ సదస్సును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలో బ్రహ్మానంద ఆలయంలోనూ భారత భాగస్వామ్యాన్ని కల్పించడంపై రాష్ట్రపతి ప్రభోకు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఆయా రంగాల్లో కలిసి పనిచేయనున్నామని మోదీ తెలిపారు. ఆసియాలో భారత్​–ఇండోనేషియాల మధ్య సంబంధాలు మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.