ఇందిరమ్మ కమిటీలలో న్యాయంగా జరగాలి
సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు మార్గదర్శకాలు పాటించాలని వేడుకోలు
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: జిల్లాల్లో పేదల ఇండ్ల కోసం వేస్తున్న ఇందిరమ్మ కమిటీలు న్యాయంగా జరగాలని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఎంపీడీఓ యాదగిరి రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు లో మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని ఎంపిడిఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు లో మార్గదర్శకాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చాయి అని చక్రపాణి ఎంపిడిఓ కు వివరించారు. మార్గదర్శకాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించాలని చక్రపాణి ఎంపిడిఓ ను కోరారు.