బంగ్లా రెండు ముక్కలే?

Is the bungalow two pieces?

Dec 23, 2024 - 13:20
 0
బంగ్లా రెండు ముక్కలే?

సరిహద్దు యుద్ధానికి భారత్​ సై
యూనస్​ మేకపోతు గాంభీర్యానికి పూర్తి చెక్​ దిశగా అడుగులు
రంగంలోకి అజిత్​ ధోవల్​ బృందం
రంగ్​ పూర్​, పూర్ణా, సియాల్​ వెట్​ లోకి బంగ్లా మైనార్టీలు
వారికి రక్షణగా భారత్​ బలగాల మోహరింపు
రష్యా, ఇజ్రాయెల్​ తరువాత భారత్​–బంగ్లా యుద్ధమే?
సాయంపై ఆశతో యుద్ధానికి బంగ్లా సిద్ధం
రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ముక్కలు కాక తప్పదంటున్న విశ్లేషకులు

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: బంగ్లాదేశ్​ తన దుందుడుకు చర్యలతో తన దేశాన్నే ముక్కలు చేసుకోనుందా? పరిణామాలు, పరిస్థితులు అలానే ఉన్నాయా? హిందువులు, మైనార్టీలు, దేవాలయాలపై దాడులతో ప్రపంచవ్యాప్త వ్యతిరేకతను ఎదుర్కొంటున్న బంగ్లాపై భారత్​ భారీ చర్యలకు ఉపక్రమించనుందా? ఇక యుద్ధ పరిస్థితులు అనివార్యమేనా? తాత్కాలిక యూనస్​ ప్రభుత్వం ఈ విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా భారత్​ తో యుద్ధం చేసేంత దమ్ము ఉందా? ఆర్థికంగా పటిష్ఠంగా ఉందా? అనే అనేక ప్రశ్నలకు కొన్నింటికి అవునని, మరికొన్నింటికి కాదనే సమాధానాలు వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం బంగ్లాపై చర్యలకు ఇప్పటికే ఉపక్రమించింది. మరోవైపు అంతర్గతంగా అక్కడి నివసించే హిందువులు, మైనార్టీలను సురక్షితంగా ఉంచేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

బంగ్లా బెదిరింపు ధోరణులకు చెక్​..
భారత్​ – బంగ్లాకు కీలమైన పశ్చిమ బెంగాల్​ తో సరిహద్దులు పంచుకుంటున్న రంగ్​ పూర్​, పూర్ణా, సియాల్​ వెట్​ ప్రాంతాలకు హిందువులను, మైనార్టీలను తరలించే చర్యలకు ఉపక్రమించింది. దీనికి సమయం పట్టనుంది. ఈ ప్రాంతాలకు ప్రజలు చేరుకుంటే మనదేశ భద్రతా బలగాలను మిగతా పనిని, వారికి భద్రత కల్పించే చర్యలకు పూర్తిగా రంగంలోకి దిగనున్నాయి. ఈ పరిణామాలతో బంగ్లా ప్రభుత్వం ఎలాగూ దృష్టి సారిస్తుంది. తమ సరిహద్దు ప్రాంతాల్లో భారత్​ హిందువులకు భద్రత కల్పించడాన్ని వ్యతిరేకించడం ఖాయం. దీంతో యుద్ధ పరిస్థితులు అనివార్యమవుతాయి. బంగ్లా, పాక్​, చైనాల సహాయంతో భారత్​ పై యుద్ధానికి దిగాలని చూస్తుంది. మరోవైపు టర్కీ లాంటి దేశాల మద్ధతు కూడా తమకు లభిస్తుందనే ఆశలో ఉంది. కానీ 1971 పాక్​ తో జరిగిన యుద్ధంలో భారత్ శక్తిని ఇటు ప్రపంచదేశాలు చూశాయి. మరోసారి భారత్​ తో పెట్టుకోవాలనే ఉద్దేశ్యాన్ని కలిగిలేవు. ఈ నేపథ్యంలో బంగ్లాకు యుద్ధం విషయంలో ఆశించిన సాయం లభించదు. 

సైనిక మోహరింపునకు భారత్​ సిద్ధం..
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ నీతి, స్నేహ బంధాలతో ఏ దేశమూ ఈ యుద్ధంలో తలదూర్చదు. చైనా కూడా వెనకడుగు వేయక తప్పదు. కానీ పాక్​, బంగ్లా యుద్ధంలో డైరెక్ట్​ గానే పాల్గొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో భారత్​ కున్న సైనిక, ఆయుధ శక్తి ముందు ఈ దేశాలు మట్టికరవక తప్పదు. అటు బంగ్లా రెండు ముక్కలవడం ఖాయం. మైనార్టీలంతా ఈ మూడు ప్రాంతాలకు వస్తే సురక్షిత బాధ్యతను తీసుకునేందుకు భారత్​ అన్ని విధాలా సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ సరిహద్దుల్లో త్రివిధ దళాలను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్​ సరిహద్దు వద్ద భారీ ఎత్తున సైనిక మోహరింపు ఉంది. 

మరో యుద్ధానికి భారత్​ సిద్ధం..
రష్యా, ఇజ్రాయెల్​ మాదిరి ప్రపంచంలో మరో సరిహద్దుగా భారత్​–బంగ్లా సరిహద్దు నిలిచే యుద్ధం ఆరంభం కానుందని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అలా జరిగితే బంగ్లా, పాక్​ ఆర్థిక పరిస్థితులు మరింత అగాధంలోకి వెళ్లడం ఖాయం. చీటికి మాటికీ రెచ్చగొట్టే ప్రకటనలిస్తూ, హిందువులపై దాడులకు పాల్పడుతూ.. చిన్మోయ్​ దాస్​ విడుదల చేయకపోవడం, దేవాలయాలను నేలమట్టం చేయడం, టాప్​ మోస్ట్​ ఉగ్రవాదులను విడిచిపెట్టి వారి ద్వారా ప్రకటనలిప్పించడం చూస్తుంటే కావాలనే బంగ్లా భారత్​ ను కెలుకుతుందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు మోదీ ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉంది. అజిత్​ ధోవల్​ నేతృత్వంలోని ఓ హైలీ కాన్ఫీడెన్షియల్​ బృందం ఈ చర్యలకు ఇప్పటికే ఉపక్రమించినట్లు తెలుస్తుంది. ఈ బృందం బంగ్లాకు చావు కబురు చల్లగా చెప్పనుందనే వాదన వినబడుతుంది.