బలూచ్ దాడి.. ఆరోపణలపై మండిపడ్డ భారత్
India outraged over Baloch attack allegations

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బలూచ్ దాడికి భారత్ కారణమన్న పాక్ ఆరోపణలపై విదేశాంగ శాఖ మండిపడింది. శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ప్రకటనలో పాక్ ఆరోపణలను తిప్పికొట్టారు. పాక్ తన భద్రతా వైఫల్యాన్ని ఇతర దేశాలపై రుద్దడం మానుకోవాలన్నారు. ప్రపంచంలో అత్యంత ఉగ్రవాద దేశం ఎవరిదో అందరికీ తెలిసిందే అని చురకలంటించారు. ప్రపంచం మొత్తానికి ఉగ్రవాదానికి కేంద్రం పాకిస్థానే అన్నారు. అంతర్గత సమస్యలను పరిష్కరించుకోలేని, వైఫల్యాలపై ఇతరులను నిందించడం మానుకోవాలని తమ దేశ పరిస్థితిని చక్కదిద్దుకోవాలని జైస్వాల్ మండిపడ్డారు.
కాగా బలూచ్ ఆపరేషన్ ముగిసిందన్న పాక్ ప్రభుత్వ ప్రకటనను బీఎల్ ఎ వీడియో మాధ్యమంగా తిప్పికొట్టింది. అలా జరిగితే విడిపించుకు వెళ్లిన బందీల ఫోటోలను రిలీజ్ చేయాలని సవాల్ విసిరింది. ఇంకా 150 మంది బందీలు తమవద్దే ఉన్నారని పేర్కొంది. వెంటనే మొండిపట్టుదల మాని తమ డిమాండ్లకు ఒప్పుకుంటే బందీలను విడుదల చేస్తామని బీఎల్ ఎ ప్రకటించింది. ఇంకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.