అమెరికా టామోటాలు తినం!
ఒక్కటైన కెనడా జాతీయులు

ఒట్టావా: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ల తరువాత కెనడా జాతీయులు ఒక్కటవుతున్నారు. ఆ దేశం నుంచి వస్తున్న దిగుమతులపై ఇప్పటికే ప్రభుత్వం 25 శాతం సుంకాలను విధించగా, మరోవైపు మార్కెట్లలో అమెరికన్ బ్రాండ్లను కెనడా జాతీయులు పూర్తిగా నిషేధించారు. దీనికి బదులుగా ఇటలీ నుంచి వస్తున్న టమోటాలు, పండ్లు, కూరగాయలు తదితరాలను కొనుగోళ్లు చేస్తున్నారు. అమెరికా ట్యాగ్ ఉన్న ఏ ఒక్క వస్తువును కొనేందుకు ఇష్టపడడం లేదు. దీంతో అమెరికన్ మార్కెట్లు 3.6 శాతం నష్టపోయాయి. సుంకాల ప్రకటన తరువాత ఇరుదేశాల్లో ఆందోళనలు, నిరసనలు, ఉద్రిక్తలు పెరిగాయి. ట్రంప్ వంద అడుగులు ముందుకేసి ఏకంగా కెనడాను అమెరికా 51వ రాష్ర్టంగా మారుస్తామని ప్రకటించారు. సరిహద్దులను మూసివేశారు. ఆర్థిక సహాయం నిలిపివేశారు. ఆఖరున సుంకాలను కూడా విధించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ట్రూడో అమెరికా విధానాలను ఎండగడుతూ ఆ దేశ ఉత్పత్తులపై భారీ సుంకాలను విధించాడు.