వడ్డీ రేట్లు తగ్గుదల?
వచ్చే నెలలో ఎంపీసీ సమావేశం

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: రిటైల్ ద్రోవ్యోల్బణం తగ్గుదల కారణంగా ఆహార వస్తువుల ధరల్లో తగ్గుదల ఏర్పడింది. దీంతో బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకున్నవారికి మరోమారు ఆర్బీఐ శుభవార్త అందించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరగనున్న ఆర్బీఐ సమావేశంలో మరోమారు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇటీవలే ఆర్బీఐ నిర్వహించిన ద్రవ్య పరపతి సమావేశం (ఎంపీసీ–మోనిటరింగ్ పాలసీ కమిటీ) రెపో రేటు తగ్గించింది. ఏప్రిల్ లో మరోమారు జరిగే సమావేశంలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనివల్ల రెపో రేటు ఆరు శాతానికి తగ్గే అవకాశం ఉంది. గతంలో 6.5 శాతం నుంచి 6.25 శాతానికి రెపోరేటు తగ్గించారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో ద్రవ్య పరపతి సమావేశం ఏప్రిల్ లో జరగనుంది.