దేశవ్యతిరేక పార్టీలు అవసరమా?

ఆర్జేడీ, కాంగ్రెస్​ కుంభకోణాల పార్టీలు. పాట్నా కైలాసపతి విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్​ షా

Mar 9, 2024 - 17:28
 0
దేశవ్యతిరేక పార్టీలు అవసరమా?

పాట్నా: ఆర్జేడీ, కాంగ్రెస్​ కుంభకోణాల పార్టీలని దేశ హితంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించే పార్టీలనీ ఇలాంటి పార్టీలు దేశానికి అవసరమా? అని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్​ షా మండిపడ్డారు.  పాట్నాలోని జగదేవ్ పాథ్ వద్ద ఉన్న ఐసీఏఆర్ క్యాంపస్‌లో కైలాసపతి మిశ్రా విగ్రహాన్ని హోంమంత్రి అమిత్ షా శనివారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్, ఆర్​జేడీ పార్టీలపై విమర్శల బాణాలు సంధించారు. ఆ రెండు పార్టీలు కుంభకోణాల పార్టీలన్నారు. ప్రధాని మోదీ ఇన్నేళ్ల రాజకీయాల్లో 25 పైసల అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. కశ్మీర్​ భారత్​ కాదా? ఆర్టికల్​ 370 రద్దు చేయవద్దా? అని ఇరు పార్టీలను నిలదీశారు. 75 ఏళ్లపాటు దేశాన్ని పాలించి పూర్తి అందకారం దిశలో, అట్టడుగున దేశ ప్రగతిని దిగజార్చారని మండిపడ్డారు. వందలయేళ్ల అయోధ్య వివాదాన్ని సమసిపోయేలా చేసి రామప్రతిష్ఠ చేస్తే ఆలయానికి కూడా రాని హిందూ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, ఆర్​జేడీలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నిరుపేదల భూములు లాక్కోవడమే లాలూ పని..

బిహార్​లో లాలూ ప్రసాద్​ యాదవ్​ కుటుంబం నిరుపేదల భూములను లాక్కోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ల్యాండ్ ​మాఫియా పేరుతో చెలరేగిపోతోందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బిహార్​లో డబుల్​ ఇంజన్​ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. ల్యాండ్​ మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించివేస్తామని హెచ్చరించారు. కమిటీలు వేసి నిరుపేదల భూములన్నీ తిరిగి వారికే అప్పజెబుతామన్నారు. ల్యాండ్​ మాఫియాను ఊచలు లెక్కపెట్టిస్తామని షా ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలో బీజేపీకి బిహార్​ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని షా అభ్యర్థించారు. 

40కి 40 స్థానాలందించాలని విజ్ఞప్తి..

బిహార్​ 40 స్థానాల్లో 2014లో 31 స్థానాలను అందించారని, 2019లో 39 సీట్లు అందించారని, 2024లో 40కి 40 సీట్లు ప్రధానికి అందజేయాలని షా కోరారు. కర్పూరీ ఠాకూర్ ​ను గౌరవించే పని ఏనాడు ఏ బిహార్​ రాజకీయ నేత చేయలేదన్నారు. ప్రధాని మోదీ ఆయనకు అత్యంత గౌరవం దక్కేలా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. రాహుల్​ ను ప్రధాని చేయాలని సోనియాగాంధీ, తేజస్విని సీఎంను చేయాలని లాలూ ప్రయత్నాల్లో ఉన్నారని, ఇలాంటి వారు నిరుపేదలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారికి కీడు చేస్తారే తప్ప మేలు చేయలేరని షా మండిపడ్డారు.