సైనికశక్తిలో భారత్ నాలుగో స్థానం
12కు దిగజారిన పాక్ ర్యాంకింగ్

నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ప్రపంచంలో బలమైన సైనికశక్తిలో భారత్ నాలుగో వరుసలో నిలిచింది. గ్లోబల్ పవర్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని 60 దేశాల సైనిక శక్తిపై జరిగిన సర్వే వివరాలు వెల్లడయ్యాయి. తొలివరుసలో అమెరికా, రెండు స్థానంలో రష్యా, మూడో స్థానంలో చైనా, నాలుగో స్థానంలో భారత్ కు చోటు దక్కింది. అదే సమయంలో మన శత్రుదేశం పాక్ 12వ స్థానానికి దిగజారిపోయింది. సైనిక విభాగాలు, ఆర్థిక స్థితి, లాజిస్టిక్స్ సామర్థ్యం, భౌగోళిక స్థానం, సాంకేతిక పురోగతి తదితర అంశాలను విశ్లేషిస్తూ ఈ సంస్థ సర్వే నివేదికను వెల్లడించింది.
అమెరికా గ్లోబల్ పవర్ ఇండెక్స్ లో 0.0744, రష్యా 00788, చైనా 0.0788, భారత్ 0.1184, దక్షిణ కొరియా 0.1656, ఫ్రాన్స్ 0.1878, జపాన్ 0.1839, టర్కీ 0.1902, ఇటలీ 0.2164తో వరుస స్థానాలలో ఉన్నాయి. పాక్ 9 నుంచి 12వ స్థానానికి దిగజారింది. ఈ క్షీణత బలహీనమైన సైనిక శక్తిని సూచిస్తుంది. అత్యల్ప ర్యాంక్ లో భూటాన్ 145వ ర్యాంకులో ఉంది.
భారత్ సైనిక శక్తి..
14.5 లక్షల భూతల ఆర్మీ, ఇందులో 11.5 లక్షల రిజర్వ్ సైనికులున్నారు. 25 లక్షలకు పైగా పారా మిలటరీ బలగాలున్నాయి. టీ–90 భీష్మ, అర్జున్ యుద్ధ ట్యాంకులు, బ్రహ్మోస్ లాంటి అత్యాధునిక క్షిపణులు, పినాక వంటి రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి. వాయుధళం విషయానికి వస్తే 2,229 విమానాలున్నాయి. ఇందులో యుద్ధ విమానాలు 600, 899 హెలికాప్టర్లు, 831 సహాయక విమానాలున్నాయి. రఫెల్, 30 ఎంకె సుఖోయ్ లాంటి విమానాలున్నాయి. క్షిపణి వ్యవస్థల్లో రుద్రం, ఆస్ట్రా, నిర్భయ్, బ్రహ్మోస్, ఆకాష్ వాయు రక్షణ వ్యవస్థలున్నాయి. నౌకా దళం విషయానికి వస్తే 1,42,251 మంది నౌకాదళ సైనికులున్నారు. ఐఎన్ఎస్ విక్రమాధిత్య, ఐఎన్ ఎస్ విక్రాంత్, 150 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, 50కిపైగా కొత్త నౌకలు, ఎంహెచ్ 60 ఆర్ విమానం, పీ–60 హెలికాప్టర్లున్నాయి. ఈ సర్వేలో ఆయా దేశాల్లో ఉన్న అణ్వాయుధాలను మాత్రం వెల్లడించలేదు.
చైనా..
20 లక్షల సైనికులు, వైమానిక దళం 3,150 విమానాలు, నౌకాదళంలో 370 యుద్ధ నౌకలున్నాయి.