భారత్​–ఖతార్​ భవిష్యత్​ వృద్ధి ఆశాజనకం

Future growth of India-Qatar is promising

Feb 18, 2025 - 19:14
 0
భారత్​–ఖతార్​ భవిష్యత్​ వృద్ధి ఆశాజనకం

సీఐఐ సదస్సులో కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత్​–ఖతార్​ ల మధ్య భవిష్యత్​ వృద్ధి కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్​, ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​, సెమీ కండక్టర్స్​ వంటి రంగాలలో ఉండనుందని కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో ఇరుదేశాల మధ్య జాయింట్​ బిజినెస్​ ఫోరం సమావేశం నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భాగస్వామ్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన ఈ ఫోరం రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పీయూష్​ గోయల్​ మాట్లాడుతూ 2047 నాటికి భారత్​ 30–35 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గుజరాత్​  ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్ సిటీ)లో పెట్టుబడులు పెట్టాలని ఖతార్ వ్యాపారులను ఆహ్వానించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించడానికి జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటును ప్రతిపాదించామన్నారు. 

అనంతరం ఖతార్​ పరిశ్రమల శాఖ మంత్రి షేక్​ ఫైసల్​ బిన్​ థానీ మాట్లాడారు. భారత్​ ఖతార్​ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించిందన్నారు. రెండు దేశాల మధ్య మరిన్ని పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఖతార్​ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలలో భారత్​ పెట్టుబడులు పెంచుతుందన్నారు. ఆయా రంగాల్లో సీఐఐ–ఖతార్​ బిజినెస్​ అసోసియేషన్​ మధ్య ‘ఇన్వెస్ట్​ ఇండియా, ఇన్వెస్ట్​ ఖతార్​’ మధ్య రెండు ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. కాగా ఏప్రిల్​ 3 నుంచి 5వ తేదీ వరకు భారత్​ నిర్వహించే స్టార్టప్​ ఇండియా మహాకుంభ్​ –2025లో ఖతార్​ పాల్గొనాలని డీపీ ఐఐటీ జాయింట్​ సెక్రెటరీ సంజీవ్​ కోరారు.