లింగ నిష్పత్తిలో పెరుగుదల

Increase in sex ratio

Dec 6, 2024 - 15:50
 0
లింగ నిష్పత్తిలో పెరుగుదల

బాలికల విద్యల పెరుగుదల నమోదు
బేటీ బచావో బేటీ పడావోకు ఆదరణ
పశ్చిమ బెంగాల్​ దూరం
రాజ్యసభలో మహిళా శిశు శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకర్​ ప్రకటన

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత లో 2014–15తో పోల్చుకుంటే లింగనిష్పత్తిలో పెరుగుదల ఏర్పడింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ మహిళ శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్​ రాజ్యసభకు వెల్లడించారు. 2014–15లో 918గా ఉన్న లింగ నిష్పత్తి 2023–24లో 930కి పెరిగిందన్నారు. యూడీఐఎస్​ ఇ పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) నివేదిక ప్రకారం, మాధ్యమిక స్థాయిలో పాఠశాలలో బాలికల జాతీయ స్థూల నమోదు నిష్పత్తి 2014లో 75.51 శాతం నుంచి -2021–-22లో గ్రామీణ ప్రాంతాల్లో 79.4 శాతంతో కలిపి 15 నుంచి 15.51 శాతం పెరిగిందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో రూపొందించిన బేటీ బచావో బేటీ పఢావో (బీబీబపీ) పథకం దేశంలో 2015 జనవరి 22న విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహకారంతో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించారు. ఇది లింగ-పక్షపాత లింగ-ఎంపిక పద్ధతులను నిరోధించడం, ఆడపిల్లల మనుగడ, భద్రతను నిర్ధారించడం, వారి విద్యను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. ఆయా విభాగాలకు నిధులను గణనీయంగా విడుదల చేస్తుండడంతో ఈ పథకాల తీరు మెరుగైన ప్రదర్శనను కనబరుస్తుంది. 918 లింగ నిష్పత్తి ఉన్న జిల్లాలకు యేడాదికి రూ. 40 లక్షలు, 919 నుంచి 952 వరకు ఉన్న జిల్లాలకు సంవత్సరానికి రూ. 30 లక్షలు కేటాయిస్తున్నారు. అంతకన్నా ఎక్కువగా ఉన్న జిల్లాలకు రూ. 20 లక్షలు నిధులను కేంద్రప్రభుత్వం అందజేస్తుంది. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని అన్ని రాష్ర్టాలు జిల్లాలు అమలు చేస్తుండగా, పశ్చిమ బెంగాల్​ మాత్రం అమలు చేయడం లేదు.