బడ్జెట్ లో ఆదాయ పన్ను మినహాయింపు?
ఇక్రా నివేదికలో కీలకాంశాల వెల్లడి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఫిబ్రవరి 1, 2025న విడుదల చేయనున్న బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుందా? ఉండదా? అనే విషయంపై ఆర్థిక విశ్లేషకుల ద్వారా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు ఇక్రా (ఐసీఆర్ఎ–ఇన్వెస్ట్ మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ) తన నివేదికలో పేర్కొంది. అదే సమయంలో 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూల్లు 12 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. కార్పొరేట్ పన్ను రాబడులు పెరగనుండగా, పరోక్ష పన్నులు 9 శాతంగా, జీఎస్టీ వసూళ్లు 10.5 శాతం పెరిగే అవకాశం ఉంది. కస్టమ్స్ 5 శాతం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ అధికారం చేపట్టాక ఆయన ప్రకటన ప్రకారం భారత్ పై అధిక సుంకాల ప్రభావంపై అనిశ్చితి నెలకొంది. 2026లో స్థూలపన్ను రాబడి మొత్తం వృద్ధి అంచనా జీడీపీ వృద్ధి రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉండనుంది. ఇది పన్నుల పెరుగుదలను సూచిస్తుంది. ద్రవ్యలోటు 2025లో 15.4 ట్రిలియన్లుగా ఉండగా, 2026లో రూ. 16 ట్రిలియన్లుగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది.
జీడీపీ పరంగా చూస్తే 2025లో ద్రవ్యలోటు 4.8 శాతం నుంచి 2026లో 4.5 శాతానికి తగ్గే అవకాశాలున్నాయి. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు నిర్ణయం కూడా గణాంకాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 2026లో మూలధన వ్యయం రూ. 11 ట్రిలియన్లుగా ఉంటుందని, 2025లో 9.7 అంచనా కంటే 12 నుంచి 13 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్న బడ్జెట్ లో ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి, ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్దారిస్తుంది.
మరోవైపు కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్ లలో మరిన్ని మార్పులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. రూ. 20లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచే అవకాశం ఉంది.
ప్రస్తుతం నెలవారీ ఆదాయంపై పన్ను రేటు..
నెలవారీ ఆదాయం పన్నుశాతం
రూ. 0–-25 వేలు 0 శాతం
రూ. 25–-57 వేలు 0 శాతం
రూ. 58–-75 వేలు 5 శాతం
రూ. 75–1 లక్ష 10 శాతం
రూ. 1 లక్ష – 1.25 లక్షలు 20 శాతం
రూ. 1.25 లక్షల కంటే ఎక్కువ 30 శాతం